ఎప్పుడూ ఏదో వ్యాఖ్యలు చేసి తనలోని అతి టాలెంట్‌ను అందరూ గుర్తించాలని తాపత్రయపడే వారిలో రామ్‌గోపాల్‌ వర్మ ముందువరుసలో వుంటారు. తను పిచ్చి సినిమాలు తీసినా.. వాటికి మీడియా పబ్లిసిటీ అవసరం. దాన్ని తెలివిగా వాడుకుంటుంటాడు. అలాంటి మీడియాను కించపరిచే విధంగా వర్మ.. ఊల్లాల్లాఊల్లాల... ఆడియో వేడుకలో మాట్లాడారు. ఆ మాట‌ల‌కు స్టేజీమీద వున్న వారందరూ నవ్వినవ్వనట్లు..గా ఆయన మాటలకు ప్రవర్తించారు.

 

    చిత్ర నిర్మాత గురురాజ్‌.. తన సుఖీభవ రియల్ ఎస్టేట్‌ నుంచి సినిమా వరకు వెన్నంటి ప్రోత్సహించింది మీడియా. వారులేనిదే నేను ఈ స్థాయిలో లేననట్లుగా.. మాట్లాడారు. అందుకే వారికి తగిన గౌవరం ఇవ్వాలని... సినిమాలోని రెండోపాటలను అన్ని మీడియాలకు చెందిన వారిని ఆహ్వానించాడు. దానికి మీడియా వారిలో అందుబాటులో వున్నవారు వెళ్ళి రెండోపాటను స్టేజ్ ఎక్కి రిలీజ్ చేశారు. దానికి ఇక ఫైనల్‌గా ముఖ్య అతిథిగా వచ్చిన వర్మ... మాట్లాడుతూ... అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ... 'ఒక్క మీడియాకు తప్ప' అన్నారు... ఎందుకంటే.. మీడియాను స్టేజీపైకి పిలవడం నాకు నచ్చలేదు. వారెప్పుడూ కిందనే వుండాలని వ్యాఖ్యానించారు. ఫైనల్‌గా ఆ సినిమా గురించి మాట్లాడితే.. పెద్దగా ఏమీ ఉపయోగం వుండదు కనుక మీడియాపై కామెంట్‌ చేస్తే అది తన సోషల్‌మీడియా టీమ్‌ను వైరల్‌ చేస్తారని భావించినట్లు కన్పిస్తుంది. ఇదే మీడియాను ఉపయోగించుకుని పలు చర్చాకార్యక్రమాల్లో పాల్గొని.. పేరు తెచ్చుకున్నాడు వ‌ర్మ‌. తెలుగులో సినిమా తీయనని... బాంబే వెళ్ళి.. అక్కడ ఇలాంటి పనులతో నెట్టివేయబడ్డాడని ఆయనపై కామెంట్లు వస్తుంటే... చివరికి తెలుగు మీడియా అవమానిస్తాడా! అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెయిట్‌  అండ్‌ సీ... కాలం ఆయనకు ఏ సమాధానం చెబుతుందో చూద్దాం.

 

 ఇక సినిమా విష‌యానికి వ‌స్తే... ''సినిమాకు సంబంధించిన టీజర్ అండ్ ట్రైలర్ చాలా బావున్నాయి. మేకింగ్‌ వీడియోలో సత్యప్రకాష్‌ను చూసి ఆశ్చర్యపోయా. తనలో ఇంత టాలెంట్‌ వుందా అనిపించింది. ఇక నాయికగా నటించిన అంకిత బాగా డాన్స్‌ చేసింది. ఈ చిత్ర నిర్మాత గురురాజ్‌కు సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నా . హీరో నటరాజ్ కి ,అలాగే చిత్ర యూనిట్ కి నా బెస్ట్ విషెస్ అందిస్తున్నాను''అని తెలిపారు.

 

నిర్మాత గురురాజ్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా కొసం వందలాది మంది పని చేశారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మాది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేశారు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జనవరి 1 న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేస్తున్నాము  '' అన్నారు  

మరింత సమాచారం తెలుసుకోండి: