మెగాసుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా యువ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కి, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిరోజు పండగే సినిమా, మొదటి రోజు మొదటి ఆట నుండి అద్భుతమైన టాక్ మరియు కలెక్షన్ తో అదరగొడుతూ ముందుకు సాగుతోంది. ఈనెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, రిలీజ్ అయి ఇప్పటికి పది రోజులు గడుస్తున్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో సూపర్బ్ గా కలెక్షన్స్ రాబడుతోందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నటుడు సత్య రాజ్ ఒక కీలక పాత్రలో నటిచడం జరిగింది. మంచి ఫ్యామిలీ, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఫుల్ లెంగ్త్ కామెడీ మరియు కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమాపై మెజారిటీ ప్రేక్షకులు మంచి స్పందనను అందిస్తుస్తుండడంతో సినిమా యూనిట్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. యువి క్రియేషన్స్, గీత ఆర్ట్స్ 2 బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ సినిమాను బన్నీ వాసు ఎంతో భారీగా నిర్మించాడు. ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఇప్పటికే వచ్చేసిందని, ఇకపై రాబోయే రోజుల్లో వచ్చేవన్నీ కూడా లాభాలే అని వారు అంటున్నారు.
ఇకపోతే ఈ సినిమా ఇప్పటివరకు ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ కు పైగా కలెక్షన్ రాబట్టి, ఇంకా అదే ఊపుతో కొనసాగుతోందని, అలానే ఇది ఇప్పటివరకు తేజ్ కెరీర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నిటిలోకి ఎక్కువని, ఈ విధంగా తేజ్ అలవోకగా హాఫ్ మిలియన్ అందుకున్నాడని అంటున్నారు. ఇక అక్కడ ఈ సినిమాను కొన్న బయ్యర్లు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారట. సినిమాలోని కథ, కథానాలను దర్శకుడు మారుతీ ఎంతో చక్కగా, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా తీసాడని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు......!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి