యువరత్న నందమూరి బాలకృష్ణ గత ఏడాది నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో పాటు ఇటీవల క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రూలర్ సినిమా కూడా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో బాలయ్యతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా కొంత నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని కసితో ఉన్న బాలయ్య, గతంలో తనకు సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్స్ ని అందించిన బోయపాటితో ఒక సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. 

 

ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో బాలయ్య రెండు పవర్ఫుల్ రోల్స్ లో నటించనున్నట్లు టాక్. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ విషయమై కొద్దిరోజులుగా పలు వార్తలు షికారు చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాలో హీరోయిన్ గా క్యాథరీన్ థెరిస్సాను ఎంపిక చేసినట్లు టాక్ వచ్చింది. అయితే ఆమె ఈ సినిమా చేయడం కోసం ఏకంగా కోటి రూపాయల పారితోషికం అడిగిందని, అయితే పెద్దగా పేరు లేని ఆమెకు కోటి ఇచ్చేందుకు దర్శక, నిర్మాతలు సిద్ధంగా లేకపోవడంతో ఒప్పుకోలేదని సమాచారం. అనంతరం ఆమె కూడా సినిమా చేయలేనని తేల్చి చెప్పిందట. 

 

కాగా ప్రస్తుతం ఆ సినిమా టీమ్ మరొక హీరోయిన్ వేటలో పడిందట. అంతేకాక మెయిన్ హీరోయిన్ తో పాటు సెకండ్ లీడ్ చేయబోయే మరొక హీరోయిన్ కోసం కూడా అతి త్వరలో అన్వేషణ ప్రారంభించనున్నారట. నిజానికి సినిమా కథ, కథనాలు, ఇతర నటీనటుల ఎంపిక ఎంతో బాగా కుదిరిన ఈ సినిమాకు హీరోయిన్ విషయమై ఇప్పటివరకు క్లారిటీ రాకపోవడంతో బాలయ్య ఫ్యాన్స్ కొంత ఆందోళన చెందుతూ, ఇకనైనా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేసారో యూనిట్ సభ్యులు ప్రకటించాలని కోరుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి బోయపాటి తమ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: