ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ హిస్టారికల్ మూవీ ఆర్ఆర్ఆర్. బాహుబలి రెండు భాగాల విజయాల తరువాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై టాలీవుడ్ తో పాటు పలు ఇతర సినిమా ఇండస్ట్రీల్లో కూడా సినిమా పై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే 75 శాతానికి పైగా షూటింగ్ ని జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇక గత కొద్దిరోజులుగా ఈ సినిమాకు సంబంధించి పలు రకాల లీక్స్ బయటకు రావడం జరిగింది. మొదటగా ఎన్టీఆర్ కొమరం భీం లుక్ లో ఉన్న కొద్దిపాటి వీడియో బయటకు రాగా, ఇటీవల ఎన్టీఆర్ అడవిలో ఒక ఫైట్ నిమిత్తం తీసిన సీన్ తాలూకు ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక అవి పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ కూడా అయ్యాయి. దానితో కొంత ఆలోచనలో పడ్డ ఆర్ఆర్ఆర్ యూనిట్, ఇకపై ఇటువంటి లీక్స్ కు అడ్డుకట్ట వేసేలా దర్శకుడు రాజమౌళి సహా సినిమా యూనిట్ మొత్తం ఒక గట్టి నిర్ణయం తీసుకుందట.
ఇకపై కేవలం యూనిట్ సభ్యులు, విజిటర్స్ మాత్రమే కాక, సెట్లోని హీరోలతో పాటు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించే సిబ్బంది వద్ద కూడా సెల్ ఫోన్ సహా మరే ఇతర ఎలక్ట్రానిక్ ఐటెం అనేది తీసుకురాకుండా గట్టిగా నిఘా పెట్టారట. అది మాత్రమే కాక, కొందరు ప్రైవేట్ సిబ్బందితో షూటింగ్ జరుగుతున్న స్పాట్ లో కూడా మరింతమంది సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందట. మరి రాజమౌళి అండ్ టీమ్ తీసుకున్న ఈ భద్రతా ఏర్పాట్లు ఇకపై ఆర్ఆర్ఆర్ ను ఎంతవరకు లీకుల బారిన పడకుండా కాపాడుతాయో చూడాలి.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి