‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ అవకాసం కలిసి వస్తే బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. దీనితో నేషనల్ సెలెబ్రెటీ గా మారబోతున్న అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ ఒకనాటి శృంగార తార షకీలా కామెంట్స్ చేయడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. 


ప్రస్తుతం చేతిలో చేయడానికి పెద్దగా సినిమాలు లేని నేపధ్యంలో మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ షకీలా తాను ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నాను అన్న సంకేతాలు ఇస్తోంది. ఇప్పటికే అనేకమంది టాప్ హీరోలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసిన షకీలా దృష్టి ఇప్పుడు బన్నీ పై పడటం చాలామందికి షాక్ ఇస్తోంది. 


లేటెస్ట్ గా షకీలా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ సీనియర్ హీరోలు అయిన చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ నాగార్జునల పై తన అభిప్రాయాలను వెల్లడించింది. ఇదే సందర్భంలో ప్రస్థుత తరం యంగ్ హీరోల ప్రస్తావన వచ్చినప్పుడు తనకు ప్రభాస్ జూనియర్ మహేష్ లు తెలుసు కానీ తనకు అల్లు అర్జున్ తెలియదు అంటూ కామెంట్స్ చేసింది. 


ఇప్పుడు ఈకామెంట్స్ బన్నీ అభిమానుల వరకు వెళ్ళడంతో అతడి అభిమానులు షకీలా ను టార్గెట్ చేస్తూ విపరీతంగా ఫైర్ అవుతున్నారు. సాధారణంగా రాజకీయాలలో ప్రముఖ వ్యక్తులు తమ ప్రత్యర్ధుల పేర్లు కూడ తమకు తెలియవు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. గతంలో నాగబాబు అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు తమకు బాలయ్య పవన్ కళ్యాణ్ పేర్లు కూడ తెలియవు అంటూ కామెంట్స్ చేసారు. ఇప్పుడు ఇలా షకీలా అల్లు అర్జున్ ఎవరో తనకు తెలియదు అని చెప్పడం వెనుక ఏదైనా మరొక కారణం ఉందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సస్ తరువాత ప్రశంసలు తప్ప విమర్శలు ఎరుగని బన్నీకి షకీలా కామెంట్స్ ఊహించని షాక్ అనుకోవాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: