తన నటనతో తొలి సినిమాతోనే ప్రేక్షకుల మదిని దోచుకున్నాడు ఈ హీరో. ప్రేమ కథ చిత్రాలకు నాది పలుకుతూ నేటి యువత హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు ఈ హీరో. ఏపీ నుండే కాదు తెలంగాణలో కూడా హీరో ఉన్నారని తెలుగు సినీ ఇండస్ట్రీకి తెలియజేశాడు ఈ నిజామాబాద్ కుర్రోడు. సినీ పరిశ్రమలో ఎవరి అండ లేకున్నా తనని తాను నిలదొకుంటూ ప్రముఖ హీరో స్థాయిలో నిలిచాడు. హీరోగా కనిపిస్తూనే మరో పక్క దర్శకుడిగా మారాడు. అతనే మన తెలంగాణ హీరో నితిన్.

 

నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ'. ఈ సినిమాను, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం నాడు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ - యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకను జరనున్నారు. 

 

ఈ వేడుకకి మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. ఆయన చేసిన సినిమాతో మనల్ని ఎంతో అలరింప చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్క దర్శకుడే కాదు. మంచి ఫిలాసఫర్ కూడా ఆయనతో కొద్దీ చూపు మాట్లాడిన చాలా విషయాలను తీసుకోవచ్చు అని అందరు అంటుంటారు. ఈ వేడుకలో మాటల మాంత్రికుడు ఎం మాట్లాడుతారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

 

ఈ ప్రేమకథాంశంలో కథానాయికగా రష్మిక కనిపించనుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ పాటలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని అంటున్నారు. ఈ సినిమా కోసం రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. కథ నడకకి అడ్డు తగులుతుందనే ఉద్దేశంతో ఆ పాటను పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. బాగా ఖర్చు పెట్టి తీసిన ఆ పాటను లేపేయడం బాధాకరమైన విషయం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: