స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భామ లయ. విజయవాడ అమ్మాయి అయిన లయ తెలుగు సినిమాల్లో తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వరన్న మాటని చెరిపేసే ప్రయత్నం చేసింది. తన అభినయంతో ప్రేక్షకుల మనసు గెలిచిన లయ సడెన్ గా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. 7 ఏళ్ల కెరియర్ లో పాతికకుపైగా సినిమాలు చేసిన లయ స్టార్ హీరోయిన్ గా మాత్రం అవకాశాలు అందుకోలేదు. 

 

తెలుగుతో పాటుగా కన్నడ, మళయాళ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు బాలకృష్ణ విజయేంద్ర వర్మ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆతర్వాత అదిరిందయ్యా చంద్ర, స్వరాభిషేకం సినిమాలు చేసింది. 2006లో లయ గణేష్ గోర్టీని పెళ్లాడింది. పెళ్లి తర్వాత గెస్ట్ రోల్స్ కూడా చేసేందుకు నిరాకరించింది లయ. తెలుగులో ఈమధ్య ఒకటి రెండు గెస్త్ అప్పియరెన్స్ గా ఛాన్సులు వచ్చినా నో అని చెప్పిందట. హీరోయిన్ గా చేస్తున్నా స్టార్ అవకాశాలు రావట్లేదని సినిమాల మీద ఆసక్తి తగ్గించుకుంది ఈ అమ్మడు. 

 

హీరోయిన్ గా కాకున్నా తన పాత్రకు గుర్తింపు వచ్చేలా ఉంటే తప్పకుండా సినిమాలు చేస్తానని అంటుంది లయ. చేసిన సినిమాలు తక్కువైనా తన మార్క్ చూపించిన లయ రీ ఎంట్రీ కోసం ఆమె ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఒకప్పటి తెలుగు హీరోయిన్స్ సర్ ప్రైజ్ రోల్స్ లో రీ ఎట్రీ ఇస్తున్నారు. కాని లయ మాత్రం అందుకు నిరాకరిస్తుంది. అయితే తనకు ఛాన్సులు వస్తున్నా తన మనసుకి నచ్చిన పాత్రలు రావట్లేదని తెలుస్తుంది.

 

తనని మెప్పించే పాత్ర వస్తే తప్పకుండా లయ మళ్లీ తెలుగు తెర మీద కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. 2018 లో వచ్చిన రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో అలా తళుక్కున మెరిసింది లయ. ఒకప్పటి హీరోయిన్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న లయకు ఆమెకు గుర్తింపు వచ్చే పాత్ర ఇవ్వాలని ఆశిద్దాం. 

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: