అల్లరి నరేష్ సినిమా యముడికి మొగుడులో హీరోయిన్ గా నటించిన రిచా పనాయ్ చీరలో కనిపించి మొగుడా.. మొగుడా..! అంటూ తన అందచందాలతో తెలుగు సినీ అభిమానులను ఫిదా చేసేసింది. లక్నోలోని సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన రిచా పనయ్ మొదటిలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పనిచేసింది. ఆ తర్వాత మోడల్ గా మారి చిన్నపాటి టీవీ యాడ్స్ లలో కనిపించింది.



ఐతే ఈ యాడ్స్ లో రిచా పనయ్ హాట్ నెస్ ని చూసిన కొంతమంది ఫిలిం మేకర్లు ఆమెకు సినిమాల్లో అవకాశాలు కల్పించారు. ఐతే యముడికి మొగుడు సినిమా తర్వాత చందమామ కథలు సినిమాలో హసీనా పాత్రలో రిచా పనయ్ నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించినా ఆ సినిమాలు అంతగా ఆదరణ పొందలేకపోయాయి. దీంతో ఆమె శాండల్ వుడ్ కి మకాం మార్చి కన్నడ సినిమాలలో అడపాదడపా నటిస్తూూ అక్కడి ప్రేక్షకులను అలరిస్తుంది.




ఇకపోతే రిచా పనాయ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో డైలీ తన ఫోటోలను అప్లోడ్ చేస్తూ తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఇప్పటికే తాను బికినీలో కనిపించి తన జీరో సైజ్ బాడీ ని, మిల్కీ స్కిన్ ని చూపించి వావ్ అనిపించింది. ఆమె బికినీ వేయని ఫోటో లు కూడా అభిమానుల మతులు పోగుడుతున్నాయంటే ఆమె అందం, చక్కని ఫ్యాషన్ స్టైల్ మాటల్లో వర్ణించలేనిది అని తెలుస్తుంది.



ముఖ్యంగా ఆమె లెహంగా లాంటి సాంప్రదాయమైన వస్త్రాలలో చాలా అందంగా కనిపిస్తుంది. పది రోజుల క్రితం ఆమె తన 27వ సంవత్సరం పుట్టినరోజును తన ఫ్రెండ్స్ లతో జరుపుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ కూడా అయ్యాయి. ఏదేమైనా ఈ నార్త్ ఇండియా ముద్దుగుమ్మ తెలుగులో మంచి కథాబలం ఉన్న సినిమాలలో నటిస్తే ఆమెకు విపరీతమైన స్టార్డమ్ వచ్చిందని సందేహంగా చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: