మాస్ మహారాజ రవితేజ ఒక్కప్పటితో పోలిస్తే ప్రస్తుతం కెరీర్ పరంగా ఒకింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అనే చెప్పాలి. ఇక ఇటీవల వరుసగా ఆయన నటిస్తున్న సినిమాలు అన్నీకూడా బాక్సాఫీస్ దగ్గర పరాజయాలు పాలవడంతో అటు ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతో నిరాశలో మునిగిపోయారు. కొద్దిరోజుల క్రితం వెరైటీ సినిమాల దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా డిస్కో రాజా సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోరంగా ఫ్లాప్ అయింది. అయితే ఆ తరువాత కొంత ఆలోచనలో పడ్డ రవితేజ, ప్రస్తుతం యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే మాస్, కమర్షియల్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. 

 

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జయమ్మ అనే పవర్ఫుల్ లేడీ పాత్రలో కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుండగా యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ ఒక మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని కొన్ని యదార్ధ ఘటనలను బేస్ చేసుకుని చిత్రీకరిస్తున్నారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. డిస్కో రాజాతో ఒకింత ప్రయోగం చేసిన రవితేజ, ఈ సినిమాతో పక్కా కమర్షియల్ ఫార్ములాను నమ్ముకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. మరి ఈ సినిమా ఆయనకు ఎంత మేర సక్సెస్ ఇస్తుందో చూడాలి. 

 

కాగా గతంలో రవితేజ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా డాన్ శ్రీను ఫ్లాప్ అవ్వగా, రెండవసారి వీరిద్దరి కాంబోలో వచ్చిన బలుపు సూపర్ హిట్ కొట్టింది. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, బలుపు లో కూడా శృతిహాసన్ హీరోయిన్ కావడం. మరి వీరి ముగ్గురి సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఈ సారి ఎంతమేర సక్సెస్ అవుతుందో, వరుసగా ఫ్లాపులతో సతమతం అవుతున్న రవితేజ, ఈ క్రాక్ సినిమాతో ఎంతమేర సక్సెస్ ట్రాక్ ఎక్కుతారో చూడాలని అంటున్నారు ప్రేక్షకులు....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: