అనుష్క శెట్టి ఈ పేరు తెలుగు ఇండస్ట్రీతో పాటు పలు ఇండస్ట్రీలకు పరిచయం లేని పేరు. తన అందం అభినయంతో తెలుగు చిత్రం పరిశ్రమలో ఈ ముద్దుగుమ్మ ఎన్నో విజయాల్ని అందుకుంది. తెలుగు సినిమాలే కాకుండా తమిళంలో కూడా సినిమాలు చేసి అక్కడ తన ఫ్యా ఫాలోయింగ్ ను పెంచుకుంది జేజమ్మ. పలు భాషలలో కలిపి ఇప్పటివరకు సుమారు 50కి పైగా చిత్రాల్లో ఆమె నటించారు. ఈ బొమ్మాళి ఎక్కువగా మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేయటంతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

 

 

 

ఎవరైనా డైరెక్టర్స్ హీరోయిన్ ఒరియంటెడ్ చిత్రాలు చేయాలి అనుకుంటే దర్శకులకు ముందు గుర్తుకు వచ్చేది అనుష్క పేరు మాత్రమే. ఈమెతో భారీ బడ్జెట్  సినిమాలు చేయడంలోనూ నిర్మాతలు వెనుకడుగు వెయ్యరు. టాలీవుడ్ లో అనుష్క యొక్క ప్రస్థానం చూస్తే.. మొదట పూరీజగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమాలో అనుష్క తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం అయింది. కాగా., కెరీర్ మొదట్లోనే రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సినిమాలో నటించింది. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. 

 

 

 

ఆ తరువాత ఎన్నెన్నో సినిమాలలో నటించి ఏ విధమైన పాత్రలలో కూడా నేను చేయగలనని నిరూపించుకుంది. అనుష్క 15 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించారు. ఎన్నో మంచి పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. విక్రమార్కుడు సినిమా తరువాత ఆమెకు మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అరుంధతి, లక్ష్యం, సౌర్యం, చింతకాయల రవి, బలాదూర్, మిర్చి, బిల్లా, వంటి ఎన్నో సినిమాలలో ఆమెను ఇండస్ట్రీలో అగ్ర కథానాయకిగా నిలబెట్టాయి. 

 

 

 

అంతే కాకుండా ఈ అమ్మడు పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో మెరిశారు. చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో, నాగార్జున నటించిన కేడి సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేశారు స్వీటీ. ఈ బొమ్మాళికి ప్రయోగాత్మక చిత్రాలు చేయటం అంటే చాలా ఇష్టం కాబోలు. సైజు జీరో సినిమా కోసం అమాంతం 20కిలోల బరువు పెరిగింది. పాత్రకోసం ఎంత దూరం అయినా వెళ్తానని ఈ సినిమాలో తెలియజెప్పింది స్వీటీ.

 

 

ఆ తరువాత 2015లో రాజమౌళి భారీ బడ్జెట్ తో దర్శకత్వం వహించి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి-2 నటించింది. ఈ రెండు భాగాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించాయి. ప్రస్తుతం దేవసేన నిశబ్ధం అనే సినిమాను చేస్తుంది. ఈ సినిమాలో స్వీటీ ముగా, చెవిటి క్యారక్టర్ లో నటించింది. ఈ సినిమాను చిత్ర యూనిట్ ఏప్రిల్ 2 న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సంవత్సరం నుంచి గ్యాప్ తీసుకున్న జేజమ్మ మళ్లీ హిట్ ని అందుకుంటుందా లేదా అన్న విషయాన్ని చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: