సోమవారం రోజు అనగా మార్చి 16వ తేదీన ఈటీవీ లో ప్రసారమయ్యే అలీతో సరదాగా షో లో ప్రదీప్ మాచిరాజు వచ్చినట్టు ఒక ప్రోమో యూట్యూబ్ లో విడుదలయింది. అయితే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలోని సూపర్ డూపర్ హిట్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్ మాచిరాజు. మొన్నటి వరకు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ప్రదీప్ ఇప్పుడు ఏకంగా వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులోని భాగంగా అతను ఈటీవీ లోని ప్రముఖ షోల ద్వారా తన చిత్రాన్ని ప్రమోట్ చేసుకుంటున్నాడు. 

 

 

మొన్నీమధ్య సుడిగాలి సుదీర్ స్క్రిప్ట్ మొత్తం ఇతని సినిమా గురించే ఉండటం గమనార్హం. ఇకపోతే హీరోగా నటించిన అతని మొట్టమొదటి సినిమా 10 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రదీప్ మాచిరాజు అలీతో సరదాగా షో లో కి రావటం ఆసక్తి రేపుతోంది. ఎప్పటిలాగానే ఈ అమలాపురం అబ్బాయి ప్రదీప్ మాచిరాజు అలీతో మాట్లాడుతూ ఎన్నో సెటైర్లు వేసి బాగా నవ్వించాడు. వాక్చాతుర్యం కలిగిన అలీ కూడా యాంకర్ ప్రదీప్ ని క్లిష్టమైన ప్రశ్నలు అడిగి ఇరకాటంలో పడేయాలని చూశాడు కానీ ప్రదీప్ ప్రదీప్ మాచిరాజు మంచి టైమింగ్ అతన్ని సేవ్ చేశాయని చెప్పుకోవచ్చు. 

 

 


ఈ ప్రోమోలో ముఖ్యంగా ఒక ప్రశ్న హైలెట్ గా మారింది. అదేంటంటే ఈ ప్రోగ్రాం హోస్ట్ అలీ ప్రదీప్ ని ఉద్దేశిస్తూ... 'నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏమిటి?' అని ప్రశ్నించగా కొన్ని సెకన్లపాటు ప్రదీప్ ఆలోచించి సోనాలి బింద్రే అని సమాధానమిస్తాడు. నేను బిందెలు, చెంబుల గురించి మాట్లాడట్లేదు. 'సోనాలి బింద్రే అంటే నాక్కూడా ఇష్టమే. నిజ జీవితంలో ఎవరు నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్?' అని అలీ ప్రశ్నించగా... 'ఆమె ఈపాటికి పాపం ఇద్దరు పిల్లలతో టీవీ చూస్తూ ఉంటారు' అని చెప్పేస్తాడు. ఇక ఇది విన్న ప్రదీప్ మాచిరాజు అభిమానులు ఆయనకి నిజంగానే లవర్ ఉందని ఊహాగానాలు చేసుకుంటున్నారు. 

 

ఇకపోతే అలీ ప్రదీప్ మాచిరాజు పెళ్లి గురించి, అతని చిన్ననాటి ఫన్నీ సంఘటన గురించి ఆరా తియ్యగా ప్రదీప్ మాచిరాజు నవ్వు పుట్టించే విధంగా ఆ సన్నివేశాల గురించి చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: