ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తాప్సీ పన్ను మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో స్టైలిష్ గా కనిపించి కుర్రకారికి నిద్ర పట్టకుండా చేసింది. ఆ సినిమా తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది కానీ అవన్నీ విజయం సాధించలేదు. ఆమె నటనని పరీక్షించే ఏ క్యారెక్టర్ ఆమెకు ఇవ్వకపోవడమే తెలుగులో తన పరాజయానికి ముఖ్యమైన కారణం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా వరుస పరాజయాలతో తెలుగు ఇండస్ట్రీ గుడ్ బాయ్ చెప్పి తాను సముద్రం లాంటి బాలీవుడ్ పరిశ్రమలో అడుగుపెట్టింది.




అయితే అక్కడ ఆమె నటన నైపుణ్యానికి తగినట్టుగా మంచి సినిమా ఆఫర్స్ లభించాయి. ఎంతో కాలం నుంచి వాటి కోసమే వేచి చూసిన తాప్సీ అవకాశాలు వచ్చే సరికి తన సత్తా ఏంటో చూపెట్టింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన బద్లా, పింక్ లాంటి థ్రిల్లర్ సినిమాల్లో టైటిల్ రోల్ లో అద్భుతంగా నటించి ఫిలింఫేర్ లో ఉత్తమ నటి అవార్డుని అందుకుంది. ఇంకా ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయాలను సాధించి ఒక స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సో, ఆమెతో లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీయడానికి సినీ దర్శక నిర్మాతలు బాగా ఆసక్తి చూపుతున్నారు. అందుకే రాకెట్ వేగంతో పరిగెత్తే ఒక గుజరాతి అమ్మాయి గురించి సినిమా తీయాలనుకుంటున్న ఆకర్ష్ ఖురానా తాప్సీ పన్ను ని లీడ్ రోల్ కోసం ఎంపిక చేసుకున్నాడు.




తాప్సీ అయితే 'రష్మి రాకెట్' గా తెరకెక్కుతున్న చిత్రంలో ఓ కల్పిత గుజరాతి అమ్మాయి పాత్రను చక్కగా పోషిస్తుందని ఆకర్ష్ కురాన్ మీడియా సమావేశాల్లో తెలియపరిచాడు. అయితే ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో తాప్సీకి భర్తగా 'భవన్ జోసి సూపర్ హీరో' చిత్రంలో కథానాయకుడిగా నటించిన ప్రియాన్షు పెయిన్యూలి నటిస్తున్నాడు. ఇతను కొన్ని నెట్ ఫ్లెక్స్ సిరీస్లలో కూడా నటించి బాగా ఫేమస్ అయ్యాడు.

 




అయితే తాజాగా అతను తాప్సీ నటిస్తున్న 'రష్మీ రాకెట్' సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రియాన్షు. తను మాట్లాడుతూ... ' ఈ సినిమాలో తాప్సీ కి మొగుడిగా నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. డిఫెన్సె బ్యాక్ గ్రౌండ్ ఉన్న నాకు ఈ సినిమాలోని ఒక ఆర్మీ పాత్రలో నటించే అవకాశం వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ పాత్రని చాలా బాధ్యతతో పోషిస్తాను' అని చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ కుర్రహీరో హాట్ బ్యూటీ తాప్సి భర్త గా నటించే ఛాన్స్ కొట్టేశాడని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఆమె సరసన నటించే ఛాన్స్ ఈ కుర్ర హీరో కి లభించడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: