కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా బాలీవుడ్ స్టార్ హీరోలు హీరోయిన్లు బయటకి రాకుండా ఇంట్లోనే సమయం గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఐతే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన చాలామంది నటులు కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ కాలయాపన చేస్తుంటే... బాలీవుడ్ భామ దీపికా పదుకొణె మాత్రం తన ఫిట్నెస్, ఆరోగ్యం మీద చాలా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నది. ఐతే ఆమె తన స్వీయ నిర్బంధన సమయంలో చేస్తున్న ప్రతి (ప్రొడ్యూక్టీవ్ యాక్టివిటీని) ఉపయోగకరమైన కార్యకలాపాలను ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తూ ఫిట్నెస్ గోల్స్ భలే పెంచేస్తుంది.




మొదటిరోజు తన వస్త్రాలను సర్ది, ఇంటిని శుబ్రపరిచినట్టు ఆమె తెలియచేయగా... రెండవరోజు సెల్ఫ్ కేర్ అంటూ ఫేస్ వాష్ లాంటి పనుల్లో నిమగమైనట్టు తెలియజేసింది. మూడవరోజు మాత్రం ఓ పెద్ద గ్లాస్ లో పండ్ల రసం తాగుతూ.. పుచ్చకాయ ముక్కలు లాగించేస్తూ కనిపించింది. అయితే ఇవన్నీ మాత్రమే తన అభిమానులు గమనిస్తుంటే... ఓ బాలీవుడ్ కుర్ర హీరో వరుణ్ ధావన్ మాత్రం 'ఏంటీ, మీరు ఎప్పుడు చూసిన నైట్ సూట్ లోనే ఉంటున్నారు?' అంటూ అనవసరమైన ప్రశ్నని అడిగారు. దాంతో దీపికా పదుకొణె చాలా కూల్ గా సమాధానమిచ్చింది.




ఆమె రిప్లయ్ ఇస్తూ... 'ఎందుకంటే నేను ఏ సమయంలోనైనా చాలా సౌకర్యంగా నిద్రపోవచ్చు' అంటూ చెప్పింది. అయితే ప్రస్తుతం వరుణ్ ధావన్ ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు వీరి మెసేజెస్ వెనక ఏదో డబల్ మీనింగ్ ఉందని రచ్చ చేస్తున్నారు. ఏది ఏమైనా దీపికా తీసుకునే సెల్ఫ్ కేర్ అందరికీ స్ఫూర్తినిస్తోంది.




ఇకపోతే దీపికా పదుకొణె తో సహా చాలామంది బాలీవుడ్ సెలెబ్రిటీలు మోడీ పిలుపుని గౌరవించి జనతా కర్ఫ్యూ ని పాటించమని, సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టి వైద్యులకు సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ముంబై నగరంలో జనతా కర్ఫ్యూ ప్రశాంతగానే జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: