మెగా స్టార్ చిరంజీవి కొరటాల ‘ఆచార్య’ మూవీ ఎప్పుడు పూర్తి అవుతుందో కూడ తెలియని పరిస్థితి. ‘భరత్ అనే నేను’ సూపర్ సక్సస్ తరువాత కొరటాలకు అనేక ఆఫర్లు వచ్చినా చిరంజీవితో సినిమా చేయాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశ్యంతో కొరటాల ‘ఆచార్య’ కోసం దాదాపు రెండు సంవత్సరాల తన విలువైన కాలాన్ని కోల్పోయాడు. 


వాస్తవానికి ఈ సినిమాను ఎదోవిధంగా ఈ సంవత్సరం దసరా కు విడుదల చేయాలి అని భావిస్తున్నా జూన్ వరకు సినిమా షూటింగ్ లు ప్రారంభం అయ్యేపరిస్థితి లేకపోవడంతో ఈ మూవీ దసరాకు విడుదల కావడం కూడ కష్టం అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే తయారు కాబడ్డ ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ లను ఉగాది రోజున విడుదల చేద్దాము అని అనుకుంటే చిరంజీవి నో చెప్పడంతో కొరటాల కూడ ఆగిపోవలసిన పరిస్థితి వచ్చింది అని అంటున్నారు.


‘ఆర్ ఆర్ ఆర్’ మోషన్ పోష్టర్ ను ఉగాది నాడు రాజమౌళి విడుదల చేయడం ఆ తరువాత చరణ్ పుట్టినరోజునాడు ‘ఆర్ ఆర్ ఆర్’ లోని చరణ్ పాత్రకు సంబంధించిన వీడియో విడుదల అవుతున్న పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రచారానికి పోటీగా ‘ఆచార్య’ ప్రచార పోటీ వద్దు అంటూ చిరంజీవి కొరటాలకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో కొరటాల చిరంజీవి మాట జవదాట లేకపోయాడు అని అంటున్నారు. 


వాస్తవానికి కొరటాల చరణ్ కోసం ‘ఆచార్య’ లో క్రియేట్ చేసిన పాత్ర షూటింగ్ కు ‘ఆర్ ఆర్ ఆర్’ అడ్డుపడుతూ ఉండటంతో చరణ్ పాత్ర షూటింగ్ వాయిదా పడింది. కనీసం ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ విడుదల చేద్దామన్నా ఈ విషయానికి కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ కొరటాల కు అన్ని విధాల సమస్యగా మారడంతో తన సమస్యలను వివరంగా చిరంజీవికి కొరటాల బయట పెట్టుకోలేని స్థితిలో ఉన్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: