సౌత్ హీరోయిన్ కు లేని క్రేజ్ తో సెన్సేషనల్ స్టార్ గా మారింది తమిళ స్టార్ హీరోయిన్ నయనతార. చంద్రముఖి, గజిని సినిమాల్లో సెకండ్ లీడ్ గా నటించిన ఈ అమ్మడు తమిళ, తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో సీనియర్ స్టార్స్ కు ఆమె ఫస్ట్ ఆప్షన్ గా మారింది. తమిళంలో తన సోలో సినిమాలు అక్కడ స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా ఉండేవి. కోలీవుడ్ లో ఆమె స్టార్ డం చూసి స్టార్ హీరోలు సైతం ముక్కున వేలేసుకున్నారు. 

 

అయితే కెరియర్ లో ఎంత క్రేజ్ తెచ్చుకుందో అన్ని వార్తల్లో నిలిచింది నయనతార. ముందు కోలీవుడ్ హీరో శింబుతో ప్రేమ వ్యవహారం అందరికి తెలిసిందే. వాళ్ళిద్దరి మధ్య సీక్రెట్ లిప్ లాక్ ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. శింబుతో లవ్ స్టోరీ ఎండ్ కార్డు పడ్డాక ప్రభుదేవాతో లవ్ స్టోరీ నడిపించింది నయనతార. నేడో రేపో పెళ్లి అన్నంత దాకా వచ్చి అతనితో కూడా దూరంగా వెళ్ళింది. వరుసగా సినిమాలు చేస్తూ మీడియా ప్రమోషన్స్ కు కూడా అటెండ్ అవని నయనతార తన లవ్ స్టోరీల గురించి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

 

నమ్మకం లేని చోట ఏ బంధం నిలబడదు. అందుకే తన ప్రేమకథలు అలా ముగిశాయని అన్నది నయనతార. అయితే ఎవరి మీద ఎవరికీ నమ్మకం లేదు.. అలా ఎందుకు జరిగింది అన్న విషయాల మీద మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి నయనతార తన లవ్ స్టోరీస్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలుసుకోవాలని అనుకున్న ఆమె ఫ్యాన్స్ కు తను చెప్పిన ఆన్సర్ షాక్ అయ్యేలా చేసింది. వరుస సినిమాలు చేస్తున్న నయనతార తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికి బిజీ హీరోయిన్ గా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: