పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో రొమాంటిక్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. తాను నటించిన సినిమాలలో దాదాపు అన్ని ఘన విజయం సాధించడం గమనార్హం. తాటి చెట్టు ఎక్కలేవు తాటి కళ్లు తెంపలేవు మళ్లి నీకెందుకురా పెళ్లి అంటూ తమ్ముడు సినిమాలో ఓ పాట పాడి ఉర్రూతలూగించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఊర మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి బద్రి సినిమాలో నటించాడు. ఆ తర్వాత చాన్నాళ్లకు మళ్లీ పవన్ కళ్యాణ్ పూరి-జగన్నాథ్ కాంబినేషన్లో కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి పూరి జగన్నాథ్ పవన్ తో కలిసి బద్రి తీసిన 12 సంవత్సరాల తరువాత మళ్ళీ అతనితో కలసి కెమెరామాన్ గంగతో రాంబాబు చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ 12 సంవత్సరాల సమయంలో పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు తీయడానికి పూరి జగన్నాథ్ ఎంతో ప్రయత్నించాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పూరి రాసుకున్న 3 స్క్రిప్టులకూ ఓకే చెప్పలేదు.


మొదటిది ఇడియట్(2002). పవన్ ని ఊహించుకొనే ఇడియట్ సినిమా కథని రాసుకున్న పూరి... పవన్ ని కలిసి అడగగా తాను మాత్రం ఆ సినిమాలో నటించేందుకు అంగీకరించలేదు. దాంతో మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో హీరో గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. రక్షిత హీరోయిన్ గా నటించిన ఇడియట్ మూవీ ఎంతలా ఘనవిజయం సాధించిందో ప్రత్యకేంగా చెప్పనక్కర్లేదు. రెండవది అమ్మానాన్న ఓ తమిళమ్మాయి(2003). ఈ సినిమా కథ ని కూడా పవన్ కళ్యాన్ కోసమే పూరి రాసాడట. కానీ పవన్ మాత్రం ఈ సినిమాకి కూడా ఓకే చెప్పలేదు. దాంతో మళ్ళీ రవితేజ తోనే కలసి ఈ కథని తెరకెక్కించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు పూరి.


మూడవది పోకిరి(2006). ఈ సినిమా స్క్రిప్ట్ ని కూడా పవన్ కళ్యాణ్ కోసమే రాసుకున్నప్పటికీ... పవర్ స్టార్ మాత్రం దీనికి కూడా ఓకే చెప్పలేదు. దాంతో సూపర్ సార్ మహేష్ బాబు ఈ చిత్రంలో హీరో ఆఫర్ ని చేజిక్కించుకొని తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించాడు. భారీ హిట్స్ అయిన ఈ మూడు చిత్రాలను రిజెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ పెద్ద తప్పు చేశాడనే చెప్పుకోవచ్చు. పవన్ ఇడియట్, పోకిరి చిత్రాలలో నటించినట్లయితే బాగుండేదని ప్రతి ఒక్క పవన్ అభిమాని అనుకోక మానరు. ఏదేమైనా గతం గతః. 

మరింత సమాచారం తెలుసుకోండి: