టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ప్రత్యేకమైన గుర్తింపు సమంత సొంతం. మరో నాలుగు రోజుల్లో పుట్టినరోజు జరుపుకోనున్న సమంత పదేళ్ల సినీ కెరీర్ లో వరుస విజయాలతో స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఏ మాయ చేశావె సినిమా నుంచి జాను సినిమా వరకు తన పాత్రలకు పూర్తి న్యాయం చేస్తూ కోట్ల సంఖ్యలో అభిమానులను సమంత సొంతం చేసుకున్నారు. కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చిన ఈ చెన్నై బ్యూటీ పెళ్లి తరువాత అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. 
 
సమంత నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు అమెరికాలో 1 మిలియన్ డాలర్ల కలెక్షన్లు తెచ్చుకున్నాయి. ఈ అరుదైన రికార్డు కేవలం సమంతకు మాత్రమే సొంతం కావడం గమనార్హం. ఎటువంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదగడం అంత తేలిక కాదు. కానీ సమంత తనదైన యాక్టింగ్ తో, హార్డ్ వర్క్ తో నటిగా గుర్తింపు తెచ్చుకుని 30కు పైగా అవార్డులను సొంతం చేసుకున్నారు. ఏ పాత్రలో నటించినా తన నటనతో ఆ పాత్రకు జీవం పోశారు. 
 
నటిగా ఇంత ఎదిగినా తన చిరకాల కోరిక నెరవేరలేదని సమంత చెబుతూ ఉంటారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయంలో చదువుకోవాలని తన చిరకాల కోరిక అని... స్టార్ హీరోయిన్ గా ఎదగటంతో ఆ కోరిక నెరలేదని సమంత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ కల నెరవేరలేదని అప్పుడప్పుడూ బాధ పడుతూ ఉంటానని సమంత పేర్కొన్నారు. ఈ సంవత్సరం సమంత నటించిన జాను సినిమా ఫిబ్రవరిలో విడుదలై యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. 
 
పస్తుతం సమంత ఓ బేబీ డైరెక్టర్ తో ఒక కొరియన్ సినిమా రీమేక్ కు, కన్నడలో హిట్టైన దియా సినిమా రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. సినిమాలే కాకుండా సమంత వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ అభిమానులకు మరింత చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. నాగచైతన్యతో పెళ్లి అనంతరం అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్న సమంత... లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తన మార్కెట్ ను పెంచుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: