టాలీవుడ్ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. గతంలో రాజకీయాల్లో రాణించాలనుకున్న  మెగాస్టార్ కు  ఎదురు దెబ్బ తగలడంతో ఆ తర్వాత రాజకీయాలకు దూరం అయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ పెద్దగా ఉన్నా మెగాస్టార్ అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. ఇటూ తెలంగాణ ముఖ్యమంత్రి అందరితో సన్నిహితంగా మెలగుతూ ముందుకు సాగుతున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గ్రేట్ ఆంధ్ర కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఆయన కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పుకొచ్చారు. ఈమధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను  కుటుంబ సమేతంగా కలిసినట్లు వున్నారు అంటూ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు చిరంజీవి. 

 

 ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కుటుంబ సమేతంగా కలగడం ఎంతో సంతోషకరమైన విషయమని... ఇప్పుడే కాదు మొదటి నుంచి వైయస్ కుటుంబంతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని అందుకే... జగన్ ను కలవడానికి ఎక్కువగా ఇష్టపడతాను అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే మా ఇరు కుటుంబాల మధ్య ఉన్నది రాజకీయాలకు అతీతమైన అనుబంధం అంటూ చిరంజీవి తెలిపారు. 

 


 అయితే జగన్ అఖండ విజయం తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి తనకు పిలుపు వచ్చినప్పటికీ అప్పుడు తన కాలికి గాయం కారణంగా వెళ్ళలేకపోయానని... కానీ మొబైల్ ద్వారా మాత్రం విష్ చేశాను అంటూ తెలిపారు. ఇక అప్పటినుంచి కలవాలని అనుకుంటే ఇటీవలే  కుదిరింది అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. అయితే సైరా నరసింహారెడ్డి సినిమా తొలి తెలుగు స్వతంత్ర సమరయోధుడు చరిత్ర కాబట్టి రాజకీయ ప్రముఖులు అందరికీ చూపించే ప్రయత్నాలు చేశామని... ముఖ్యంగా రాయలసీమ బిడ్డ అయిన సీఎం జగన్ కు చూపించాలని అనుకున్నట్లు చిరంజీవి తెలిపారు.

 

 

అయితే ఈ విషయం చెప్పగానే ఆఫీస్ కు  రమ్మంటారేమో అని అనుకున్నాను కానీ ఏకంగా ఇంటికి అక్కని తీసుకుని ఇంటికి  రమ్మని  అంటూ జగన్ ఆహ్వానించారు అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఇచ్చిన ఆతిథ్యం గౌరవం తనను ముగ్దున్ని చేశాయని.. అదంతా  మరువలేనిది అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. అయితే జగన్ ను కలిసిన తర్వాత నాకున్న ఇమేజ్  మొత్తం పొలిటికల్ కి అతీతం  అన్నది అర్థమైంది అంటూ  చిరంజీవి తెలిపారు. ఒక మనిషిగా  నాకు  అంత మంచి గుర్తింపు ఉన్నప్పుడు ఇక పాలిటిక్స్ అవసరమా అంటూ తెలిపారూ చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: