ఈ సృష్టిలో అతి గొప్పదైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అది అమ్మ ప్రేమ అని చెప్పాలి . నవమాసాలు మోసి తన ఊపిరి తో ఊపిరి అల్లి కడుపులో ఉన్నప్పటినుండే ఎంతో ప్రేమగా చూసుకొని... తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఊపిరిని ధారపోసి మనకు జన్మనిస్తుంది అమ్మ. అలాంటి అమ్మను ఏం చేసినా ఋణం తీర్చుకోలేం . అమ్మ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతటి మహానుభావుడైన తల్లి గర్భం నుంచి జన్మించాల్సిందే... ఎంతటి మహా వీరుడైన తల్లి ముందు చిన్న పిల్లవాడే... ఈ క్రమంలోనే అన్నపూర్ణమ్మ నాగార్జున మధ్య ప్రేమ చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది.
అప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న అక్కినేని నాగేశ్వరావును భూస్వామ్య కుటుంబంలో జన్మించిన అన్నపూర్ణమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అన్నపూర్ణమ్మ కు ఇద్దరు అబ్బాయిలు అక్కినేని వెంకట్ అక్కినేని నాగార్జున. అలాగే ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. అక్కినేని నాగసుశీల, అక్కినేని సత్యవతి. ఇక బిజినెస్ పరంగా ఈ నలుగురు పిల్లలు వేరే వేరే చోట స్థిరపడ్డారు.
అక్కినేని వెంకట్ వైజాగ్ లో ఉంటూ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. అక్కినేని నాగార్జున ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో గా కొనసాగుతున్నారు. ఇక నాగార్జున మాత్రం తల్లిని తన వద్ద ఉంచుకుని ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు.అమ్మే ఆరాధ్య దైవంగా తల్లిని పూజించేవాడు నాగార్జున. ఇక తల్లి పేరుమీదనే అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి... దాన్ని అలాగే కొనసాగిస్తూ తన తల్లి పేరు ఇప్పటికీ ఎంతోమంది తలచుకునేలా చేస్తున్నారు నాగార్జున. అంతే కాకుండా తల్లి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు నాగార్జున. కడవరకు కూడా తల్లిని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారూ నాగార్జున. అన్నపూర్ణమ్మకు నాగార్జున అంటే ఎంతో అమితమైన ప్రేమ. ఇక ఇద్దరు తల్లి కొడుకుల మధ్య అనుబంధం ఎంతో బాగుండేది తల్లి చనిపోయిన తర్వాత తండ్రిని కూడా ఎలాంటి లోటు లేకుండా ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు నాగార్జున.