రేపు విశాఖలో పవన్ తల పెట్టిన బహిరంగ సమావేశంలో పవన్ తన రాజకీయ ఎజెండాను ప్రజలకు తెలియ చెప్పి ముఖ్యంగా రాష్ట్రంలోని యువతరాన్ని తాను అనుకున్నలక్ష్యాలవైపు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు పవన్. గత కొద్ది రోజులుగా పవన్ నరేంద్రమోడీని కలిసి మద్దతు చెప్పడం మినహా సాధించిన మరో విషయం లేదు. అయితే లోలోన మాత్రం చాలా కసరత్తు జరుగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది.
బయటకు వస్తున్న వార్తల ప్రకారం పవన్ చంద్రబాబుల భేటీ అనుకున్నంత సంతృప్తి పవన్ కు ఇవ్వలేక పోవడంతో పవన్ తన రాజకీయ ఎత్తుగడలలో మరొక మార్గం గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల నేపధ్యంలో పవన్ రెండు మూడు రోజుల కిందట బ్రహ్మానందంతో రహస్యంగా భేటీ అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి..
బ్రహ్మానందం ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఆయనతో తాను పార్టీ స్థాపించిన ఉద్దేశం, రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్న వ్యవహారం గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. అయితే పవన్ కల్యాణ్, బ్రహ్మానందంను స్వయంగా తన పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారా? లేదా, తాను మద్దతు ఇస్తున్న భాజపాలోకి వెళ్లాల్సిందిగా పురిగొల్పారా? అనే క్లారిటీ లేదు. అయితే బ్రహ్మానందo పవన్ ల మధ్య రహస్య సమావేశం జరిగిందని పవన్ సన్నిహితులు కూడ అంగీకరిస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ చర్చ అని అంటున్నారు.
గత రెండు రోజులుగా బ్రహ్మానందo కూడ భారతీయ జనతా పార్టీలో చేరుతాడు అని వచ్చిన ఊహగానాలకు స్వయంగా బ్రహ్మానందo ఆ వార్తలను ఖండించిన నేపధ్యంలో అసలు పవన్ బ్రహ్మానందoల సమావేశం ఒక పజిల్ లా మారింది అని అంటున్నారు. ఇప్పటికే పవన్ కు అత్యంత సన్నిహితులైన కమెడియన్లు ఆలీ, వేణుమాధవ్ లు తెలుగుదేశంలో ఉన్న నేపధ్యంలో పవన్ కు బ్రహ్మానందo ఏమి సలహా ఇచ్చాడు అనే విషయం పై రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: