2005, జులై 1న విడుదల అయిన నా ఊపిరి సినిమాలో వడ్డేనవీన్, సంగీత, ఎం.ఎస్ నారాయణ, అంజన, సుధా, గుండు హనుమంతరావు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా... కన్మణి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే లను కూడా కన్మణి అందించగా... వి. పూసల మాటలు రాశారు. కథ గురించి తెలుసుకుంటే... వేణు(వడ్డే నవీన్) అనే ఓ యువకుడి తల్లి చిన్నతనంలోనే మరణిస్తుంది. అప్పటికే అతనికి తల్లిదండ్రులు కోల్పోయిన గౌరీ అనే ఒక అమ్మాయి పరిచయమవుతుంది. ఆ అమ్మాయి తన మామయ్య వాళ్ళ ఇంట్లో జీవనం సాగిస్తుంది. ఎప్పుడైతే వేణు తల్లి చనిపోయిందని తెలిసిందో... అప్పుడే అతడితో కలిసి జీవించడానికి గౌరీ సిద్ధమవుతోంది. ఆ విధంగా వాళ్ళిద్దరూ కలిసి జీవనం సాగిస్తూ 20ఏళ్లు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటారు. కుటుంబాన్ని పోషించడానికి వేణు ఓ కంపెనీలో సూపర్ వైసర్ గా పనిచేస్తుండగా... సంగీత ఇంటివద్దే ఉంటూ పనులు చేస్తూ ఉంటుంది. 


తన సహోద్యోగులైన ప్రసాద్( ఏం.ఎస్ నారాయణ), మూర్తి( గుండు హనుమంతరావు) లకు ఎప్పుడూ తన భార్య గౌరీ, కుమారుడు రాము గురించి వేణు చెబుతుంటాడు. గౌరీ పుట్టినరోజు అని, రాముకి బొమ్మలు కొనాలని అడ్వాన్సు తీసుకొని మరీ తన డ్యూటీ నుండి త్వరగా వెళ్ళిపోతాడు. ఇదంతా తెలుసుకుంటున్న ప్రసాద్, మూర్తిలు అతడికి తన భార్యపై ఉన్న ప్రేమను చూసి ముచ్చట పడుతుంటారు. ఈ క్రమంలోనే మధు(అంజన) అనే ఒక యువతి తాను అనాధనని అబద్ధం చెప్పి వేణు జీవితంలో అడుగుపెట్టి అతడితో సరసాలాడుతూ వెంటపడుతుంటుంది. ఆ అమ్మాయి కూడా తనలాగే అనాధ అనుకోని వేణు ఆమె తో చనువుగా ఉంటాడు. అయితే ఒకానొక సందర్భంలో సహోద్యోగుల అయిన మూర్తి, ప్రసాద్ లు మధు పెళ్లయిన వేణు జీవితంలోకి వచ్చి అతని జీవితాన్ని నాశనం చేస్తుందని తిట్టిపోస్తారు. 


అప్పుడే డాక్టర్ సుధా ఎంట్రీ ఇచ్చి అందరినీ కలిపి వేణు ఇంటికి తీసుకెళ్తుంది. ఆ సమయంలోనే సహోద్యోగులకు, సినీ ప్రేక్షకులకు కూడా వేణు భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో చనిపోయిందని తెలుస్తుంది. మూడేళ్ల క్రితమే చనిపోయిన తన భార్య పై ఉన్న విపరీతమైన ప్రేమ కారణంగా వేణు ఆమె బతికి ఉన్నట్టే ఊహించుకుంటున్నాడని డాక్టర్ సుధా చెబుతోంది. మధు కూడా ఒక సైకియాట్రిస్ట్ స్టూడెంట్ అని, ఆమె వేణు జీవితంలో అడుగు పెట్టడానికి తానే కారణమని చెబుతోంది. ఊహల తో బతికే వేణు కి ట్రీట్మెంట్ ఇప్పిస్తానని, వారం రోజుల్లోనే డాక్టర్ ని కల్పిస్తున్నామని ఆమె వేణు కి చెప్పి వెళ్ళిపోతుంది. కానీ వేణు మాత్రం చికిత్స చేయించుకోవడానికి ఇష్టపడకుండా తనకు తన భార్యతో ఉండటమే కావాలని ఒక లెటర్ రాసి తన సొంత గ్రామానికి వెళ్ళిపోతాడు. దాంతో సినిమా అయిపోతుంది. 


మనోవైకల్యం తో బాధపడుతున్న వ్యక్తి గా వడ్డే నవీన్ నటించినందుకు గాను అతనికి నంది అవార్డులలో స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఈ సినిమాలోని నటన తన సినీ కెరీర్ లోనే ఉత్తమమైనదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ సినిమా కథ ది బ్యూటిఫుల్ మైండ్, సిక్స్త్ సెన్స్ వంటి హాలీవుడ్ చిత్రాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని రూపొందించినది అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా తెలుగు ప్రేక్షకులకు నా ఊపిరి మూవీలో కామెడీ ఎమోషనల్ సన్నివేశాల్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగా నచ్చేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: