గత ఏడాది క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో, ఎన్టీఆర్ బయోపిక్ మూవీస్ కథానాయకుడు, మహానాయకుడు తో పాటు, రూలర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ, వాటితో ఏ మాత్రం సక్సెస్ అందుకోలేకపోయారు. వరుసగా మూడు సినిమాలు పరాజయాలు పాలవడంతో, కొంత ఆలోచన చేసిన అనంతరం, తన నెక్స్ట్ మూవీ ని బోయపాటి తో చేయాలని ఫిక్స్ అయిన బాలయ్య, ప్రస్తుతం ఆయనతో ఒక భారీ మాస్, యాక్షన్ మూవీ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, నెక్స్ట్ షెడ్యూల్ ని రాబోయే మరికొద్దిరోజుల్లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 

 

బాలయ్య సరసన ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకుంటున్నాం అని, అలానే సినిమాలో ఆయన రెండు పాత్రల్లో కనిపించనుండగా, అందులో అఘోరా పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారని ఇటీవల బోయపాటి చెప్పారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మంచి రెస్పాన్స్ ని అందుకోవడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇక దీని తరువాత బి. గోపాల్ దర్శకత్వంలో బాలయ్య నెక్స్ట్ సినిమా చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా, ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఎంతో భారీ లెవెల్లో తెరకెక్కించనున్న ఈ సినిమాలో బాలయ్య ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నారని అంటున్నారు. 

 

ఇప్పటికే ఈ సినిమా పూర్తి కథ, కథనాలు విన్న బాలయ్య, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సినిమాని మొదలెడదాం అని అన్నారట. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా పలువురు హీరోయిన్స్ ని పరిశీలించిన బి. గోపాల్, ఫైనల్ గా అనుష్క ని కన్ఫర్మ్ చేసినట్లు చెప్తున్నారు. మరికొద్దిరోజుల్లో అనుష్కని కలిసి కథ వినిపించనున్నారని, అన్నీ కలిసివస్తే దసరా సమయానికి ఈ సినిమా అఫీషియల్ అనౌన్సుమెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దాదాపుగా పుష్కర కాలం క్రితం, వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్కమగాడు సినిమాలో బాలయ్యకు జోడిగా జతకట్టిన అనుష్క, మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఆయనతో కలిసి నటిస్తుండడం విశేషం. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: