గడచిన రెండేళ్ల క్రితం టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా కెజిఎఫ్ చాప్టర్ 1. కన్నడ నటుడు యాష్ హీరోగా తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ మూవీ కి యువ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, హోంబలె ఫిలిమ్స్ వారు దీనిని ఎంతో భారీ ఖర్చుతో నిర్మించారు. కన్నడ, తెలుగు సహా పాన్ ఇండియా మూవీ గా పలు ఇతర భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా, అన్ని భాషల్లో కూడా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కోలార్ గనుల నేపథ్యంలో పలు కమర్షియల్ హంగులు జోడించి దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమా ద్వారా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా పరిచయం అవ్వగా రవి బస్రూర్ సంగీతాన్ని,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించాడు.  

ఇక ఇటీవల కొన్నాళ్లుగా ఈ సినిమాకు సీక్వెల్ గా కెజిఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం కంటే మించి మరింత ఖర్చుతో మరిన్ని భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇక దీని తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక సినిమా చేయనున్నారని, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు దానిని నిర్మించనున్నారని కొద్దిరోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  

ఇక రెండు రోజుల నుండి ప్రచారమవుతున్న మరొక వార్త ప్రకారం, రెబల్ స్టార్ ప్రభాస్ కోసం కూడా ప్రశాంత్ నీల్ ఒక అద్బుతమైన కథను సిద్ధం చేస్తున్నారని, ఆల్మోస్ట్ చాలావరకు పూర్తి అయిన ఆ స్క్రిప్ట్ ని ఆయన త్వరలోనే ప్రభాస్ కు వినిపించే అవకాశం ఉందని అంటున్నారు. అన్ని కలిసి వస్తే వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కొచ్చని టాక్. అయితే ఈ రెండు వార్తల విస్తృత ప్రచారంతో అటు ఎన్టీఆర్, ఇటు ప్రభాస్ సినిమాల్లో దర్శకుడు ప్రశాంత్ ముందుగా దేనిని పట్టాలెక్కిస్తారు అనే దానిపై స్పష్టత లేకపోవడంతో, ఇంతకీ మీరు మొదట ఏ హీరోతో చేస్తారో చెప్పండి, మాకు ఇక్కడ నరాలు తెగేంతటి టెన్షన్ గా ఉంది అంటూ పలువురు టాలీవుడ్ ప్రేక్షకులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా దర్శకుడు ప్రశాంత్ నీల్ ని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: