మధ్యలో రాజమౌళి బర్త్‌డే వుందని బ్రేక్ తీసుకున్నట్టు వున్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే… మళ్ళీ షూట్ స్టార్ట్ అవుతున్నది. బుధవారం నుండి తారక్, ఎన్టీఆర్, రాజమౌళి మళ్ళీ సెట్స్ మీదకు రానున్నారు. ఈసారి బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ చేస్తార్ట. అక్టోబర్ 14 నుండి షూట్ మొదలుపెట్టి నాన్ స్టాప్‌గా రెండు నెలలు కంటిన్యూ షెడ్యూల్ చెయ్యాలని ప్లాన్ చేశార్ట. మధ్యలో సండేలు బ్రేక్ తీసుకుంటే తీసుకోవచ్చని యూనిట్ వర్గాల టాక్. ఈ లాంగ్ షెడ్యూల్‌లో ఇద్దరు హీరోలు వుంటారు.
ఆల్రెడీ రామ్ చరణ్ టీజర్ రిలీజ్ చేశారు. విజయదశమికి ముందు ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చెయ్యనున్నట్టు అనౌన్స్ చేశారు. మొన్న రెండు రోజులు ఆ టీజర్‌కి సంబంధించి షాట్స్ తెరకెక్కించార్ట. ప్రస్తుతానికి సినిమా రిలీజ్ డేట్ చెప్పలేనని రాజమౌళి అంటున్నాడు. రెండు నెలల షూటింగ్ అనుకున్నట్టు సాగితే అప్పుడు చెప్తాడట. రీసెంట్‌గా రాజమౌళి బర్త్‌డేకి కంప్లయింట్స్ ఇస్తూ తారక్, చరణ్, కీరవాణి, ఆర్‌ఆర్‌ఆర్ యూనిట్ చేసిన వీడియో రెస్పాన్స్ బాగుంది.
ఈ సినిమా తరువాత దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ కోసం కొన్ని కోట్లాదిమంది మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలే వున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి