దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత నెల 25న మనందరినీ విడిచి అనంతలోకాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తొలి సినిమా మర్యాద రామన్న నుండి దాదాపుగా 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బాలసుబ్రమణ్యం మరణం ఎందరో అభిమానులు అలానే సినీ ప్రముఖులను ఎంతో కలిచివేసింది అని చెప్పక తప్పదు. కొన్నాళ్ళ క్రితం కరోనా బారినపడ్డ బాలసుబ్రమణ్యం ఆ తర్వాత వ్యాధి తగ్గినప్పటికీ కూడా మరికొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆయన ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు ఆయనను చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు. అయినప్పటికీ ఆ తరువాత ఆయన పరిస్థితి మరింతగా విషమించడంతో చివరికి మరణించడం జరిగింది.
ఇక కొన్నేళ్లక్రితం ఒకానొక సందర్భంలో బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ తో తనకు చిన్న కారణంవలన కొంత మాటపట్టింపు వచ్చిందని, దానితో ఆయన సినిమాలకు తాను రెండేళ్లకుపైగా పాడలేదని అన్నారు. అయితే ఆ తరువాత ఆ వివాదం సర్దుమణిగి అక్కడినుండి కృష్ణ నటించిన అనేక సినిమాలకు పాటలు పాడానని చెప్పారు బాలసుబ్రహ్మణ్యం.

ఇక ఇటీవల ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న చివరి సమయంలో బాలసుబ్రమణ్యం ఒకానొక సమయంలో సూపర్ స్టార్ కృష్ణతో మాట్లాడాలని తన తనయుడు చరణ్ ని కోరారని, ఆపై కృష్ణ తో బాలు ఫోన్ లో మాట్లాడడం కూడా జరిగిందని అంటున్నారు. అయితే తామిద్దరి మధ్య వచ్చిన రెండేళ్ల గ్యాప్ లో కృష్ణ తన గురించి ఏమైనా తప్పుగా అనుకున్నారా అనేది మొదటి నుంచి బాలసుబ్రమణ్యం మనసులో ఉండిపోయిందని, అందుకే చివరి సమయంలో అదే విషయమై కృష్ణతో మనసువిప్పి ఆయన మాట్లాడారని అంటున్నారు. ఎంతో గొప్ప మనస్తత్వం, వ్యక్తిత్వం కలిగిన బాలసుబ్రమణ్యం మొదటి నుంచి వివాదరహితుడు అనే విషయం తెలిసిందే. అంత గొప్ప గాయకుడు నేడు మరి మన మధ్యన లేకపోవడం నిజంగా ఎవరూ పూరించలేని లోటు అని చెప్పక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: