తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా  కొనసాగుతున్న రాశి ఖన్నా తన అందం చందం తో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యువ హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది రాశి  ఖన్నా. ఇక ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రాశికన్నా మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతున్న విషయం తెలిసిందే.



 ప్రతి రోజు పండగే అనే సినిమాలో టిక్ టాక్ కి ఎడిక్ట్  అయిన యువతిగా రాశిఖన్నా నటన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. అదే సమయంలో ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య హీరోలుగా మల్టీ స్టారర్ గా తెరకెక్కిన వెంకీ మామ సినిమాలో నాగచైతన్య కు జోడిగా నటించిన రాసి కన్నా తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాతో ఒక డిఫరెంట్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.



 అయితే లాక్ పూర్తయి ప్రస్తుతం షూటింగు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే నటీనటులు షూటింగ్ లలో  పాల్గొంటున్న విషయం తెలిసిందే ఇక  ఇటీవలే ఓ ఇంటర్వ్యూ కి హాజరైన రాసి కన్నా తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నాను అంటూ చెప్పిన రాసి కన్నా.. తన జీవితంలో ఇప్పటి వరకు స్పెషల్ పర్సన్ ఎవరూ లేరు అంటూ క్లారిటి ఇచ్చింది. ఒకవేళ అలాంటి పర్సన్  తన లైఫ్ లోకి వస్తే తప్పకుండా అతనితో డేటింగ్ వెళ్తానని.. ఇక లాక్డౌన్ సమయంలో ఎంతో మంది వివాహబంధం లోకి అడుగుపెట్టారు అంటూ చెప్పుకొచ్చింది. రానా కాజల్ నితిన్ తమ  సోల్  మేట్  నీ  పెళ్లి చేసుకున్నారని తనకు కూడా అలాంటి అందమైన రోజు వస్తుందని భావిస్తున్నాను  అంటూ చెప్పుకొచ్చింది రాశిఖన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి: