గతంలో కార్పోరేట్ సంస్థలు ప్రవేటు బ్యాంక్ యాజమాన్యాలకు దూరంగా ఉండేవి. అయితే ఇప్పుడు కార్పోరేట్ దిగ్ఘజాలు ప్రవేట్ బ్యాంక్ ల యాజమాన్యంలోకి రాబోతున్నాయి. ఇక దీంతో త్వరలో టాటా బిర్లా రిలయన్స్ ఆదాని ఎల్ ఎన్ టి పేర్లతో ప్రవేట్ బ్యాంక్ లు రావడానికి రంగం సిద్ధం అవుతోంది.


పైన పేర్కున్న కార్పోరేట్ సంస్థలు త్వరలో ప్రవేట్ బ్యాంక్ లను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతుల కోసం క్లియరెన్స్ ఇవ్వవలసిందిగా ఆర్ బి ఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ సిఫార్స్ చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనికోసం బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో అవసరమైన అనేక సవరణలు చేయడానికి మార్గం ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎవరైనా ఒక ప్రవేట్ బ్యాంక్ నెలకొల్పాలి అంటే కనీసపు మూలధన అర్హత 1000 కోట్లు ఉండే విధంగా చట్టంలో మార్పులు చేయబోతున్నారు.


ఇప్పటి వరకు మెరుగైన ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు అయిన రిలయన్స్ మనీ టాటా ఫైనాన్స్ లాంటి ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలు త్వరలో బ్యాంక్ లుగా మారే అవకాశం ఉంది. ఈమధ్య కాలంలో అనేక ప్రముఖ ప్రవేట్ బ్యాంక్ లు సమస్యలలో ఇరుకుంటున్న పరిస్థితులలో కొంతకాలంపాటు కొత్త ప్రవేట్ బ్యాంక్ లకు అనుమతులు రావడం కష్టం అని చాలమంది భావించారు. అయితే ఈ విషయాలను లెక్క చేయకుండా కార్పోరేట్ బ్యాంక్ లకు లైన్ క్లియర్ అవుతూ ఉండటం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.


దీనికితోడు దేశంలో మరిన్ని పెమంట్ బ్యాంక్ లు వచ్చే పరిస్థితులు కూడ కనిపిస్తున్నాయి. అయితే ప్రవేట్ బ్యాంక్ ల ప్రమోటర్ల వాటా పరిమితిని ప్రస్తుతం ఉన్న 15శాతం నుండి 25 శాతానికి పెంచే ఆలోచనలు చేస్తున్న పరిస్థితులలో బాగా ఆర్ధికంగా నిలబడ్డ బడా పారిశ్రామిక వేత్తలు మాత్రమే ఇలాంటి ప్రవేట్ బ్యాంక్ లను రానున్న రోజుల్లో పెట్టే పరితితులు కనిపిస్తూ ఉండటంతో ఖాతాదారుల ప్రయోజనానికి ఎటువంటి సమస్య ఉండకపోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: