మరోవైపు ఎవరికి వారి అభిమానులు అలానే ప్రేక్షకులు ఓట్లు కూడా భారీగానే నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మాకు అందుతున్న సమాచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ ఆఖరి వారం ఓటింగ్ పొజిషన్స్ లో కొద్దిపాటి ట్విస్టులు అయితే నమోదయినట్లు తెలుస్తోంది. ముందుగా అందరికంటే భారీస్థాయి ఓట్లతో అభిజిత్ దూసుకెళ్ళగా ఆ తర్వాత రెండు, మూడు స్థానాల విషయమై మాత్రం సోహెల్, అరియానాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది అంటున్నారు. అయితే చివరి రోజు మాత్రం సోహైల్ ఒకింత భారీస్థాయి ఓటింగ్ దక్కించుకొని ముందుకు దూసుకెళ్లడం జరిగిందని కొన్ని పోల్స్ చెప్తుంటే మరికొన్ని పోల్స్ ప్రకారం అరియానా ముందుకు దూసుకెళ్లిందని చెబుతున్నారు.
ఏదిఏమైనప్పటికీ అభిజిత్ టాప్ స్థానంలో కొనసాగుతుండగా రెండో స్థానం వీరిద్దరిలో ఎవరో ఒకరు అలానే నాలుగో స్థానం ఇక అందరికంటే చివరి స్థానాలను అఖిల్, హారిక లు దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా దీన్నిబట్టి చూసుకున్నట్లయితే హౌస్ నుంచి రేపు మొట్టమొదట ఎలిమినేట్ అయ్యేది హారిక అని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో అలానే ఫైనల్ విన్నర్ గా, రన్నర్ గా ఎవరు నిలుస్తారో తెలియాలి అంటే మరి కొన్ని గంటల వరకు వెయిట్ చేయాలి.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి