అక్కినేని నాగార్జున హీరోగా విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం లో తెరకెక్కిన రాజన్న సినిమా అప్పట్లోఎంత ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాలోని పాటలు ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులను రక్తాన్ని ఉరకలెత్తించింది  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఒకప్పుడు తెలంగాణ ప్రజలు పడిన చిత్ర హింసలను కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించారు దర్శకుడు. చిన్న సినిమాగా ఈ సినిమా తెరకెక్కింది అయినప్పటికి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ముఖ్యంగా ఈ సినిమాలో నాగార్జున నటనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు అనే చెప్పాలి.


 ఇప్పటి వరకు నాగార్జున తన కెరీర్ లో ఇలాంటి పాత్ర చేయకపోవడంతో ఇక ఈ పాత్ర అభిమానులందరినీ సర్ప్రైస్ చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. కాగా ఇక ఈ సినిమాలోని పాటలు అయితే ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తునే ఉన్నాయి. 2011 సంవత్సరంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనే విషయం తెలిసిందే. అయితే దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాను తమిళంలో వర్షన్ లో  విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు .


 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజన్న చిత్ర నిర్మాత ప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తమిళంలో విడుదల కాబోతున్న తెలంగాణ విప్లవ కారుడు కథ అక్కడి ప్రేక్షకులు కూడా మెప్పించి ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది అంటూ చిత్రనిర్మాత ధీమా  వ్యక్తం చేశారు. ఇక నాగార్జున సినిమా తమిళ వర్షన్ లో కూడా విడుదల అవుతూ ఉండడంతో ప్రస్తుతం అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: