ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... తెలుగు, తమిళ సుపరిచిత  హీరో కార్తీ నటించిన ‘యుగానికి ఒక్కడు’ సినిమా  విడుదలై  దశాబ్దం  దాటేసింది. అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. తమిళంలో తెరకెక్కిన ‘ఆయిరత్తిల్ ఒరువన్’ సినిమాను తెలుగులో ‘యుగానికి ఒక్కడు’ అనే పేరుతో అనువదించారు. ‘7/జి బృందావన్ కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ సినిమాను              తెరకెక్కించాడు.ఇప్పుడు ఈ సినిమాకి  సీక్వెల్ ని ప్రకటించారు దర్శకుడు సెల్వ రాఘవన్.

అయితే ఈ సినిమాలో మాత్రం కార్తీ హీరోగా నటించడం లేదు.కార్తీకి బదులుగా ధనుష్ ని రంగంలోకి దింపారు. ఈ విషయాన్ని ధనుష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ కోసం పూర్తి స్థాయిలో కష్ట పడతామని ధనుష్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్  చేశాడు. ఈ సీక్వెల్ సినిమాను 2024లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడానికే ఏడాది సమయం పడుతుందని..కానీ బెస్ట్ సినిమాగా తెరకెక్కిస్తామంటూ ధనుష్ సోషల్ మీడియాలో తెలిపాడు. తొలిభాగ‌మైన యుగానికి ఒక్క‌డు సినిమాకు ఇది కొన‌సాగింపుగా ఉంటుందని తెలుస్తోంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...      


మరింత సమాచారం తెలుసుకోండి: