సంక్రాంతినాడు విడుదల కాబోతున్న ‘వకీల్ సాబ్’ టీజర్ కోసం పవన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈటీజర్ కు వచ్చే రెస్పాన్స్ బట్టి ఈమూవీ బిజినెస్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈమూవీ టీజర్ ను చాల జాగ్రత్తగా ఎడిట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు సుమారు రెండు నిముషాలు నిడివితో ఉండే ఈ టీజర్ పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టీజర్ లో మెట్రో రైల్ లో పవన్ చేసే ఒక ఫైట్ సీన్ ఉంటుందని టాక్. ఆ ఫైట్ సీన్ పూర్తి అయిన తరువాత పవన్ ‘కోర్టులో కోటు వేసుకుని వాదించగలను కోర్టు బయట కోటు తీసి వాయించగలను’ అనే పంచ్ డైలాగ్ తన స్టైల్ లో చెపుతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.  


ఈ మూవీలో మూడు ఫైట్స్ సీన్స్ ఉంటాయని అంటున్నారు. ఇక ఈ టీజర్ చివరిలో ఒక డీసిఎమ్ వ్యాన్ లో పవన్ తన సామాను అంతా వేసుకుని ఆ సామాను పై కాళ్ళు చాపుకుని పడుకుని ఉన్న సీన్ తో ఎండ్ అవుతుందని అంటున్నారు.


ఇక ఈమూవీలో ఒక కాలనీలో గూండాలకు భయపడి అందరూ ఇళ్ళు ఖాళీ చేస్తూ ఉంటే పవన్ మాత్రం స్వామీ వివేకానంద పుస్తకాన్ని చదువుతూ ఆ గూండాలను పట్టించుకోడని తెలుస్తోంది. దీనితో కోపగించుకున్న ఆ గూండా పవన్ చేతిలోని వివేకానంద పుస్తకాన్ని లాక్కుని గాలిలోకి ఎగరవేయడంతో కోపంతో పవన్ ఆ గూండాను చితకకొట్టే సీన్ తో పవన్ ఇంట్రడక్షన్ సీన్ ఈ మూవీలో ఉంటుందని అంటున్నారు. పవన్ కు పుస్తకాలు అంటే విపరీతమైన అభిమానం ముఖ్యంగా స్వామీ వివేకానంద అరవింద్ ఘోష్ గుంటూరు శేషేంద్ర శర్మ పుస్తకాలతో పాటు అనేక వేదాంత పుస్తకాలను పవన్ షూటింగ్ గ్యాప్ లో చదువుకుంటూ ఉంటాడు. పవన్ కు పుస్తకాల పై ఉన్న ప్రేమను సగటు ప్రేక్షకుడుకి అర్థం అవ్వడానికి ఈ మూవీలో ఇలా పవన్ చేతిలో స్వామీ వివేకానంద పుస్తకాన్ని పెట్టి ఉంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి: