మహారాజా రవితేజ హీరోగా ప్రస్తుతం తెరకెక్కిన క్రాక్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ దిశగా భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మంచి మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా ఎస్ తమన్ మ్యూజిక్ ని జీకే విష్ణు ఫోటోగ్రఫీ అందించారు. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఈ సినిమాలో కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరూ కూడా నెగిటివ్ పాత్రల్లో నటించి ప్రేక్షకాభిమానుల నుంచి మంచి పేరు దక్కించుకున్నారు.
కొన్నాళ్ల నుంచి కెరియర్ పరంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న మాస్ రాజా రవితేజకి ఒక్కసారిగా ఈ క్రాక్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అతి పెద్ద బ్రేక్ నిచ్చింది అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమాలో రవితేజ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత రవితేజ నటించబోయే మరొక సినిమా కూడా ఖరారైనట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. గబ్బర్ సింగ్, డిజె, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్ వంటి పవర్ ఫుల్ సినిమాలతో అత్యద్భుతమైన విజయాలు అందుకున్న హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయనున్నారని టాక్.

కొద్ది రోజుల క్రితం అదిరిపోయే మంచి మాస్ స్టోరీని రవితేజకు వినిపించిన హరీష్ శంకర్  అది ఆయనకు ఎంతో నచ్చడంతో ఏడాది ద్వితీయార్థంలో దానిని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అతి త్వరలో పవర్ స్టార్ తో ఒక సినిమా చేయనున్న హరీష్ శంకర్ దాని అనంతరం రవితేజతో సినిమా షురూ చేయనున్నారని అంటున్నారు. ఇక గతంలో రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన మిరపకాయ్ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారిక న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: