ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే.  ఎన్నో ఏళ్ల నుంచి ప్రస్తుతం బుల్లితెరపై కామెడీకి కేరాఫ్ అడ్రెస్స్ గా... చిరునవ్వుల చిరునామాగా మారిపోయింది జబర్దస్త్. ప్రతి వారం కూడా బుల్లితెర ప్రేక్షకులను సరికొత్త కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటుంది. ఇక జబర్దస్త్ కామెడీ షో లో కమెడియన్స్ అందరూ కూడా ప్రతివారం సరికొత్త స్క్రిప్ట్ తో   ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఏ సినిమా విడుదలైన కూడా ప్రమోషన్స్ కోసం జబర్దస్త్ కార్యక్రమానికి రావడం సర్వసాధారణంగా మారిపోయింది.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో  ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో... తెరకెక్కిన చిత్రం జాతిరత్నాలు. ఇందులో నవీన్ పొలిశెట్టి తో పాటు రాహుల్  రామకృష్ణ, ప్రియదర్శి కూడా నటించారు. మార్చి 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర బంధం. ఈ క్రమంలోనే ఇటీవలే ఎంతో ఫేమస్ అయిన జబర్దస్త్  కార్యక్రమంలో ప్రమోషన్స్ నిర్వహించేందుకు జాతిరత్నాలు చిత్రబృందం వచ్చింది.



 ఇక సాధారణంగానే ఎక్కడైనా సరే హీరో నవీన్ పోలిశెట్టి ఎంతో చురుకుగా కనిపిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. టకటకా మాట్లాడుతూ ఎప్పుడూ ఇతరుల పై పంచులు వేస్తూ ఉంటాడు. ఇక ఇటీవల జబర్దస్త్ లో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి తనదైన శైలిలో కామెడీ పంచుతు  వచ్చాడు. మీ స్టైల్ అంటే నాకు ఎంతో ఇష్టం అంటూ జడ్జి రోజా చెప్పడంతో ఇది రిపీట్ చేయండి అంటూ చెబుతాడు నవీన్ పొలిశెట్టి.  ఇక ఆ తర్వాత అదిరే అభి స్కిట్ చేస్తున్న టైమ్ లో  కూడా  అదిరే ఆది పంచ్ వేయడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఈ క్రమంలోనే మియు స్పాంటినిటీ  బాగుంది అంటూ జడ్జి రోజా నవీన్ పోలిశెట్టి పొగుడుతుంది.. అప్పుడు కూడా పొంగి పోకుండా తనదైన శైలిలో సమాధానం ఇస్తాడు నవీన్ పొలిశెట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: