సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ కృష్ణ అల్లుడిగా, అలాగే సూపర్ స్టార్ మహేష్ బావమరిదిగా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.కృష్ణ గారి చిన్న కూతురు ప్రియదర్శినిని సుధీర్ బాబు పెళ్లి చేసుకున్నాడు.సినిమా హీరో కాకముందు బాడ్మింటన్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక "ఎస్ ఎమ్ ఎస్" సినిమాతో చాలా ఎనర్జిటిక్ గా ఎంట్రీ ఇచ్చాడు.రెజీనా హీరోయిన్ గా ఈ సినిమాలో నటించింది.మొదటి సినిమాతోనే నటుడిగా సుధీర్ బాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తన యాక్టింగ్, డాన్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు.సుధీర్ బాబు మంచి నటుడు మాత్రమే కాదు. బాగా కష్టపడే వ్యక్తిత్వం కలవాడు.


ఇక సుధీర్ బాబు కి ఫిట్ గా ఉండటం అంటే చాలా ఇష్టం. ఆకట్టుకునే బాడీతో సుధీర్ బాబు యూత్ కి ఆదర్శంగా మారాడు.సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే సినిమా కోసం చాలా కష్టపడి తన బాడీని ఫిట్ గా మార్చుకున్నాడు. అలాగే యాక్టింగ్ కూడా నేర్చుకున్నాడు. తన మామ, బావ లాగే వివాదాల జోలికి వెళ్లకుండా సూపర్ హీరోగా నిరూపించుకున్నాడు.అలాగే టాలీవుడ్ హీరోల్లో విమర్శకులు లేని హీరో అయ్యాడు.


తన సహజమైన నటనతో అందరి హీరోల అభిమానులని ఆకట్టుకోగల ఏకైక హీరో సుధీర్ బాబు. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా కాని సుధీర్ బాబు నటన మాత్రం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక బాలీవుడ్ లో కూడా 'భాగీ' అనే సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు.ఇక చివరగా 'వి' సినిమాలో నటించాడు. ఆ సినిమా ప్లాప్ అయినా కాని సుధీర్ బాబు నటన ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ప్రస్తుతం మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సమ్మోహనం' సినిమా ఎంతగానో ఆకట్టుకుంది.ఇప్పుడు 'వి' సినిమా తరువాత మూడోసారి మోహన్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: