టాలీవుడ్ లో నే కాదు  ఏ ఇండస్ట్రీలో అయినా సీనియర్ హీరోయిన్ లు రీ ఎంట్రీ ఇస్తూ మళ్లీ నటనపై వారికున్న ఆసక్తిని వెల్లబరుస్తూ ఉంటారు. ఒకసారి సినిమాల్లో నటిస్తే దాన్ని వదిలి పోవడం ఎవరికీ ఇష్టం ఉండదు.  సినిమాలకి బ్రేక్ ఇస్తారు తప్ప పులిస్టాప్ మాత్రం పెట్టరు నటీనటులు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే యుక్తవయసులో సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్లుగా కొన్ని సినిమాలు చేసి ఒక టైంలో సినిమాలు తగ్గిపోతున్న సమయంలో పెళ్లిళ్లు చేసుకుని వారి వైవాహిక జీవితం లోకి వెళ్లి పోతారు. అలా కొన్ని సంవత్సరాలు భర్త పిల్లలు అంటూ వారి వైవాహిక జీవితాన్ని చూసుకొని మిడిల్ ఏజ్ వచ్చాక మళ్ళీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

 ఈసారి హీరోయిన్ గా తమని తీసుకోరు కాబట్టి వారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తారు. హీరో, హీరోయిన్ ల తల్లి పాత్రలలో అక్క పాత్రలలో వదిన పాత్రలలో నటిస్తూ తమ అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకుంటారు. ఆ విధంగా చాలా మంది పాత తరం హీరోయిన్లు కం బ్యాక్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయిపోయారు. అలాంటి హీరోయిన్ లలో ఒకరు ఆమని. శుభలగ్నం, మావిచిగురు వంటి చిత్రాలతో ఆమని హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు టాలీవుడ్ లో.  ఆ తర్వాత ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చి వరస సినిమాలతో తన సత్తా చాటుతున్నారు.
 
ఇటీవలే ఆమె కార్తికేయ హీరోగా నటించిన చావు కబురు చల్లగా సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు సినిమాల్లో తల్లి పాత్ర అంటే సంప్రదాయానికి ప్రతీక లాగా, కట్టుబొట్టు, పద్ధతి చాలా బాగా ఉండేలా చూసుకుంటారు మన దర్శకులు కానీ ఈ సినిమాలో అమని పాత్ర ఎంతో వెరైటీగా తీర్చిదిద్దారు దర్శకుడు. అక్రమ సంబంధం, మందు తాగడం, అసభ్యకరమైన భాష వంటి కొత్త ఆలోచనతో కొత్తదనం ఉండేలా ఆమె పాత్రను తీర్చిదిద్దారు దర్శకుడు. ఈ సినిమా విడుదల సమయంలో ఈమె చేసిన పాత్ర పై వివాదాలు నెలకొనగా ఈ నేచర్ ఆడవారికి ఇవి ఉంటే తప్పేంటి అని వాదించిన వారు కూడా ఉన్నారు. ఏదేమైనా ఈ పాత్ర చేయడం ఆమని కెరియర్కు ఎంతగా ప్లస్  ఆవ్వడంతోపాటు వైవిధ్యభరితమైన సినిమా చేశారు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఫ్యాన్స్ లో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: