తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు భారీగానే అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన మొదటి సినిమా ఈశ్వర్ తోనే మాస్ లో మంచి పాలోయింగ్ ని తెచ్చుకున్నాడు. ఇక V. v వినాయక్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ యోగి. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా నయనతార నటించారు. ఈ ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమా 2007సంక్రాంతికి భారీ  ఎత్తున విడుదల అయ్యింది. ఇక వినాయక్ కాంబినేషనులో రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంతో భారీగా విడుదలైన  ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

అయితే కన్నడ లో భారీ విజయం సాధించిన జోగి సినిమాని తెలుగులో యోగిగా రీమెక్ చేశారు. అయితే అక్కడ ఆడిన సినిమా ఇక్కడ ఎందుకు కనెక్ట్ అవ్వలేదని పరిశీలిస్తే, తల్లీ కొడుకుల భారీ సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీలో  సీనియర్ నటి అయిన శారదను తీసుకోవడం దర్శకుడు వినాయక్ చేసిన పెద్ద తప్పు అని విశ్లేషకులు చెప్పారు..ఇక అప్పటికే సీనియర్ నటి శారద గారు బామ్మ పాత్రలు చేస్తూ ప్రభాస్ కు తల్లిగా చేయడాన్ని చూసి ప్రభాస్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అయితే తల్లికి బంగారు గాజులు చేయించి బాగా చూసుకోవాలని, హీరో కర్నూల్ లోని బేతంచెర్ల నుంచి హైదరాబాద్ వచ్చి హోటల్ లో పనిచేస్తూ అనుకున్న పని సాధిస్తాడు తిరిగి ఊరు వెళ్తున్న సమయంలో ఓ కేసులో జైలుకి వెళ్తాడు.ఇదిలా ఉండగా  కొడుకుని వెతుక్కుంటూ తల్లి హైదరాబాద్ రావడం,వారిద్దరూ దగ్గరగానే తిరుగుతున్నా  గుర్తించలేకపోవడం, చివరకు యోగిని చూడకుండానే తల్లి కన్నుమూయడం ప్రేక్షకులని  ఆకట్టుకోలేకపోయింది. ఇక విషాదం ఎప్పటికీ ముగియదా అన్నట్లు చివరిలో టాగ్ లైన్ ఇంగ్లీషులో తగిలించడం ప్రేక్షకులకి కి అస్సలు నచ్చలేదనే చెప్పాలి. ఇక ఇందులో విలేఖరి పాత్రచేసిన నయన కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

అంతేకాదు.. విలేఖరిగా ఉంటూ గ్యాంగస్టర్ తో సాంగ్స్ ఊహించుకోవడం ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. అంతేకాక.. తల్లి శవం పక్కనుంచి వెళ్తున్నా ఆమెను కనీసం చూడక పోవడం ప్రేక్షకులు భరించలేకపోయారు. ఈ సినిమాలో కమెడియన్స్ గా నటించిన అలీ, సునీల్, వేణు మాధవ్ కామెడీ తప్ప ఈ సినిమాలో పెద్దగా ఆకట్టుకునే సన్నివేశాలు లేవు అని చెప్పాలి. ఇక భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ లను నిలువునా ముంచేసి కష్టాలలోకి నెట్టిందనే చెప్పాలి 

మరింత సమాచారం తెలుసుకోండి: