గతంలో కూడా మనోజ్ సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడట . 2017లో వచ్చిన ఒక్కడు మిగిలాడు సినిమా పరాజయం తర్వాత తాను రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడని సమాచారం. అయితే, ఇలాంటి విషయాల్లో తొందరపాటు మంచిది కాదని తండ్రి మోహన్ బాబు మంచి క్లాస్ పీకడంతో నిర్ణయం మార్చుకున్నాడని సమాచారం. ఆ తర్వాత కొత్త దర్శకుడు శ్రీకాంత్‌తో అహం బ్రహ్మాస్మి అనే పాన్ ఇండియా సినిమా మొదలు పెట్టాడట. కానీ ఈ సినిమా గురించి ఈ మధ్య కాలంలో ఎలాంటి అప్‌డేట్స్ రావట్లేదు. దీంతో ఈ సినిమా ఆదిలోనే ఆగిపోయిందంటూ ప్రచారం మొదలైందట . దానికి తోడు మంచు మనోజ్ కొత్త బిజినెస్ కూడా మొదలు పెట్టడంతో నిజమని అందరు నమ్మారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటాడనే వార్తలు వచ్చాయని సమాచారం. దీంతో స్పందించిన మంచు మనోజ్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధాలేనని తేల్చి చెప్పేసాడు. ఈ మేరకు ట్విటర్‌లో ఒక పోస్టు పెట్టాడని తెలుస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో యువతకు ఉద్యోగాలు కల్పించడానికి బిజినెస్ చేయబోయే మాట నిజమే కానీ దానికోసం సినిమాలకు దూరం అవుతున్నాను అని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశాడట మంచు మనోజ్. వచ్చే వేసవి నుంచి తన కొత్త సినిమా షూటింగ్ మొదలవుతుందని చెప్పాడట మనోజ్. ఈ మధ్యే తిరుమల శ్రీవారి దర్శనానికి అక్క మంచు లక్ష్మితో కలిసి వెళ్లిన మనోజ్ మీడియాతో ముచ్చటించినట్లు సమాచారం.ఈ సందర్భంగా త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త వెంచర్స్ ప్రారంభించ బోతున్నట్లు వాటితో యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించాడట మంచు మనోజ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి