తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా కొనసాగుతున్న బిగ్ బాస్ లోకి ఒక్కసారిగా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు అంటే అప్పటి వరకు ఎవరికీ తెలియని వారు సైతం సెలబ్రిటీలు గా మారిపోతూ ఉంటారూ.  అంతే కాదు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇక వరుసగా అవకాశాలు ముంగిట వచ్చి వాలి పోతూ ఉంటాయి.  అందుకే ఎంతోమంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని ఇటీవలి కాలంలో కోరుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు అన్ని బిగ్బాస్ సీజన్ లతో పోల్చి చూస్తే అటు బిగ్బాస్ నాలుగవ సీజన్లో పార్టిస్పెంట్స్ కి బాగా క్రేజ్ వచ్చేసింది.


 క్రేజ్ మాత్రమే కాదు అవకాశాలు కూడా వరుసగా వచ్చి వాలి పోతున్నాయి. ఇలా వరుస అవకాశాలు అందుకుంటున్న వారిలో బిగ్ బాస్ ఫైనల్ వరకు వెళ్లి టాప్ త్రీ లో నిలిచిన సోహైల్ కూడా ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్ లో తెలంగాణ పోరాడి లాగా తన యాసతో తన ఆటిట్యూడ్తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చివరి వరకు కొనసాగి చివరికి ఫైనల్ వరకు వచ్చాడు సోహెల్. ఇక ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తుండడంతో ఎంతో బిజీ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం సోహైల్ నటిస్తున్న చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. సాధారణంగా అమ్మాయిలు ప్రెగ్నెంట్ అవుతారు. కానీ ఇందులో హీరో సోహైల్ ప్రెగ్నెంట్ కావడం షాకింగ్ విషయం.



 ఈ విషయం అందరికీ తెలిసేలా ఇటీవల చిత్ర బృందం టీజర్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇక ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కారులో నుంచి ఎంతో స్టైల్గా దిగిన సోహెల్ అక్కడ ఉన్న విలన్స్ అందరిని చితక్కొట్టాడు. కానీ ఆ తర్వాత షాకింగ్ విషయం చెపుతాడు. ఏకంగా నేను ప్రెగ్నెంట్ అంటూ చెబుతాడు.. వెల్కమ్ టు ది న్యూ వరల్డ్ బేబీ అంటూ చెప్పే డైలాగ్ తో సోహైల్ లుక్ ఆకర్షిస్తుంది. దీంతో ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది అనే దానిపై ఇప్పటికే అంచనాలు కూడా మొదలైపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: