యక్షన్ తో సాగె మాస్ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాలో తన పాత్ర కోసం పూర్తిగా బాడీ పెంచిన విజయ్ దేవరకొండ దానితో పాటు పలు యుద్ధ విద్యల్లో విదేశీ నిపుణుల నుండి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారట. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లిగా నటిస్తుండగా, ఆమె పాత్ర సినిమాని కీలక మలుపు తిప్పుతుందని అంటున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. విషయం ఏమిటంటే, ఈ సినిమా నుండి రేపు సాయంత్రం 4 గంటలకు ఒక అప్ డేట్ రానున్నట్లు చెప్తున్నాయి టాలీవుడ్ వర్గాలు.
కాగా అది సినిమాలో ఫస్ట్ సాంగ్ గురించి అని అంటున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ లైగర్ సినిమా త్వరలో గోవాలో నెక్స్ట్ షెడ్యూల్ ని జరుపుకోనుందట. నిజానికి ఈ సినిమాని ఈ నెల 7న రిలీజ్ చేస్తున్నట్లు కొన్ని నెలల క్రితం ప్రకటించిన యూనిట్, మధ్యలో కరోనా కారణంగా చాలారోజులు షూట్ వాయిదా పడడంతో విడుదలని కూడా పోస్ట్ పోన్ చేసారు. కాగా అందుతున్న న్యూస్ ప్రకారం లైగర్ మూవీ ఈ ఏడాది నవంబర్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి