టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కంప్లీట్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమా అని చెప్పాలి. భారతీయ ఇతిహాస చరిత్రలో  ఒక భాగం ఈ కధాంశం. ఇక విశ్వామిత్రుడు మేనకల సంతానంకి చెందిన ఆడపిల్లను కణ్వ మహర్షి చేరదీసి పెంచి శకుంతల అని పేరు పెట్టి పెంచడం జరుగుతుంది. ఇక ఆ మీదట దుష్యంతుడు ఆమెని వలచి వరించి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఇక అది ఆనక ఆయన ముని శాపం మీద శకుంతలను మరచిపోవడం కధలో ముఖ్య ఘట్టాలట. ఇక తన భర్తకు దూరమై ఒంటరి అయిన శకుంతల భరతుడు అనే కుమారుడిని కని భర్త దుష్యంతుడి కరుణ కోసం ఎదురు చూడడం చివరికి ముని శాపం తొలగిపోయి రాజు ఆమెను గుర్తించి తమ భార్యగా స్వీకరించడం అనేది ఈ సినిమా కధ అట.

ఇక ఇప్పటి వరకు ఏమో కానీ ఈ సినిమా రిలీజ్ అవుతున్న సమయానికి సమంత నిజ జీవితంలో కూడా కొన్ని బాధాకర ఘటనలు జరగడంతో ఈ మూవీ మీద హైప్ మరింతగా పెంచేస్తాయని తెలుస్తుంది. శకుంతల జీవితమే ఒక విషాదం అని చెప్పాలి. ఇక పుడుతూనే కన్న వారికి కూడా దూరమై ఆనక భర్త ప్రేమకు కూడా దూరమై చివరి దాకా కూడా కడగండ్లు పడిన  వనిత కథ ఈ సినిమా. ఇక ఆ పాత్ర పోషిస్తున్న సమంత కూడా తన నిజ జీవితంలో కొత్త గా విడాకులు తీసుకోవడం అనేది జరిగింది. ఇక చర్చ అనేది ఏ వైపు ఎలా ఉన్నా కాని ఆమె మీద జనాలకు సానుభూతి అనేది ఎలాగో ఉంటుంది. ఇక ఈ సినిమాలోని సమంత పాత్ర కూడా అంతకు మించి సింపతీని క్రియేట్ చేసేదిగా కూడా ఉంటుంది. ఇక టాలీవుడ్ లో ఫుల్ లెంగ్త్ లో సమంత చాలా కాలానికి చేసిన ఈ సినిమా కనుక విడుదల అయితే మాత్రం కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా అన్న చర్చ అయితే ఇప్పుడు నడుస్తుంది. ఇక మొత్తానికి ఒక సమంత ఒక శాకుంతలం అని చెప్పవచ్చు. చూడాలి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: