టాలివుడ్‌లో ఎవ‌రి నోట చూసిన ఇప్పుడు స‌మంత నాగ‌చైత‌న్య విడాకుల గురించి చ‌ర్చించుకుంటున్నారు. నిన్న మ‌న్న‌టి వ‌ర‌కు చాలా సంతోషంగా ఉన్న ఈ దంప‌తులు విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో అంద‌రూ షాక్‌కు గుర‌య్యారు. ఇది ఎప్ప‌టి నుంచో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన‌ప్ప‌టికీ అంద‌రూ అంత‌గా ప‌ట్టించుకోలేదు. అధికారికంగా స‌మంత‌, నాగ‌చైత‌న్య‌లు ప్ర‌క‌టించ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. స‌మంత‌, నాగ‌చైత‌న్య బంధం దాదాపు 11 ఏండ్ల కాలం పాటు కొన‌సాగించింది. దాదాపు ఏడేంట్ల పాటు ప్రేమించుకొని ఆ త‌రువాత పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు స‌మంత‌, నాగ‌చైత‌న్య‌. ఒక‌రిపై ఒక‌రూ ఎంతో ప్రేమ‌ను పంచుకున్నారు.
 ముఖ్యంగా స‌మంత త‌న శ‌రీరంపై నాగ‌చైత‌న్య గుర్తుల‌ను టాటు వేయించుకున్నారు. విడాకుల‌కు ముందే టాటుల‌ను చెరిపేశారు. టాటూల‌తోనే వారిద్ద‌రీ మ‌ధ్య బంధం తెగిపోయింద‌ని చాలా వ‌ర‌కు తెలిసిపోయింది. ఇదిలా ఉండ‌గానే  స‌మంత త‌న పేరులో ఉన్న అక్కినేని అనే ప‌దాన్ని తొల‌గించ‌డంతో విడాకులు తీసుకుంటార‌ని క్లారిటీ వ‌చ్చింది. ఈ స‌మ‌యంలోనే స‌మంత ముంబ‌యి వెళ్లిన‌ట్టు తెలిసింది. కానీ స‌మంత త‌న‌కు హైద‌రాబాద్ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్న విష‌యం విధిత‌మే. చివ‌ర‌కు వీరిరువురు విడాకుల‌పై ఓ క్లారిటీ ఇచ్చారు.
ఇది ఇలా ఉండ‌గా నెటిజ‌న్లు నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకుల‌పై తెగ ట్రోల్ చేస్తున్నారు. విడాకుల‌కు స‌మంతనే కార‌ణ‌మ‌ని కొంద‌రంటుంటే.. కాదు నాగ చైత‌న్య‌నే కార‌ణ‌మ‌ని మ‌రికొంద‌రూ పేర్కొంటున్నారు. ఎవ‌రికీ వారు ర‌క‌ర‌కాలుగా సోష‌ల్ మీడియాలో వారికి తోచిన విధంగా ప‌లు కామెంట్లు చేస్తున్నారు. ఈ విష‌యంలో నెటిజ‌న్స్‌పై సీనియ‌ర్ న‌టీ ఖుష్బూ సోష‌ల్ మీడియా ద్వారా స్పందించింది. నాగ‌చైత‌న్య‌, స‌మంత దంప‌తులు విడిపోయారు.  వారి వ్య‌క్తిగ‌తమైన విష‌యం. వారు విడిపోవ‌డానికి కార‌ణం ఏమిట‌నేది వారిద్ద‌రికీ త‌ప్ప మ‌రెవ్వ‌రికీ తెలియ‌దు అని సీరియ‌స్ అయ్యారు.  వారి వ్య‌క్తి గ‌త విష‌యాల‌ను అంద‌రం గౌర‌వించాలి.  త‌ప్ప అంద‌రూ ఎవ‌రి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు ఊహించుకోవ‌ద్ద‌ని ఖుష్బూ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ఖుష్బూ ట్విట్ పై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ  సాగుతోంది.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: