ఉప్పెన సినిమాతో స్టార్ హీరోగా ఎదిగాడు వైష్ణవ్ తేజ్. ఇక తన మొదటి సినిమాతోనే మంచి కలెక్షన్లు రాబట్టాడు. తాజాగా వైష్ణవి తేజ్ నటించిన కొండపొలం చిత్రం ఇటీవలే విడుదలైంది.ఈ సినిమా పై కూడా ఎంతో మంది సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీతి సింగ్ నటించింది. ఈ మూవీని డైరెక్టర్ క్రిష్ నిర్వహించారు. ఇక హీరో వైష్ణవ్ తేజ్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఆ వివరాలను చూద్దాం.


వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. కొండపొలం సినిమా స్టోరీ చాలా కొత్తగా ఉండటంతో నేను ఈ సినిమాకి ఒప్పుకున్నాను. నేను ఇలాంటి కథ ఎప్పుడు వినలేదు. అంతేకాకుండా క్రిష్ డైరెక్షన్లో వచ్చిన గమ్యం వేదం వంటి మూవీస్ కూడా నాకు చాలా ఇష్టం అని తెలియజేశాడు. డైరెక్టర్ క్రిష్ మేకింగ్ చాలా బాగుంటుంది అని తెలియజేశాడు. కొండపొలం మూవీలో కొన్ని కమర్షియల్ అంశాలు కూడా చాలా ఉన్నాయి అని తెలియజేశాడు వైష్ణవ్ తేజ్.

 ఈ మధ్యకాలంలో వచ్చినా రంగస్థలం సినిమా  నుంచి ప్రతి ఒక్కరూ ఏదో ఒక కొత్త కోణంతో సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారు మన దర్శకులు.ఇక కొండపొలం సినిమాలో నాలుక్ వేరేలా ఉంటుందని తెలియజేశాడు. తన మొదటి సినిమాకి రెండవ సినిమాకి చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అని చెప్పుకొచ్చాడు.స్టార్ హీరోల సినిమాలు చూసినప్పుడు నాకు కూడా అలాంటి కథలు చేయాలని పించేది అని చెప్పుకొచ్చాడు.

అందులో ముఖ్యంగా ప్రభాస్ అన్న సినిమాలు అంటే చాలా ఇష్టం. ప్రభాస్ అన్న సినిమాలలో కొడుతున్నప్పుడు నాక్కూడా  అలా కొట్టాలి అనిపించేది. అంతేకాకుండా వైష్ణవ్ తేజ్ ఫ్యామిలీ కూడా  వైష్ణవ్ ను అలాంటి పాత్రలో చూడటం అంటే చాలా ఇష్టమట.అందుచేతనే ఎవరైనా కొత్త కథలు చెబితే ఆసక్తికరంగా వింటానని తెలియజేశాడు.ఇక హీరో (అన్నయ్య)సాయి ధరంతేజ్ రిపబ్లిక్ సినిమాలో ఐఏఎస్ అయితే కొండ పొలం సినిమాలో ఐఎఫ్ఎస్ పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు

మరింత సమాచారం తెలుసుకోండి: