టాలీవుడ్‌ క్యూట్‌ అండ్‌ బ్యూటీ ఫుల్ కపుల్‌ నాగ చైతన్య మరియు సమంతలు విడిపోతున్నట్లుగా ప్రకటించారని అందరికి తెలుసు. వారి ప్రకటన అభిమానులకు గుండెలు బద్దలు అయ్యేలా చేసిందని అనడంలో ఎటువంటి సందేహం లేదని తెలుస్తుంది.

ప్రతి ఒక్కరు కూడా వారిద్దరు విడిపోతున్నారు అంటూ వార్తలు వచ్చిన సమయంలో వద్దనుకున్న వారే ఉన్నారని తెలుస్తుంది.. కాని ఎవరు వద్దనుకున్నా కూడా వారిద్దరి విడాకులు మాత్రం ఆగలేదని సమాచారం. ఇద్దరు కూడా విడి పోతున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో అభిమానులు కొందరు ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తుంది. మరి కొందరు ఏకంగా కన్నీరు పెట్టుకున్నారని సమాచారం. అంతగా అభిమానులు వారిని కలిపి అభిమానిస్తున్నారని తెలుస్తుంది. అలాంటి నాగ చైతన్య మరియు సమంతలు ప్రస్తుతం విడి విడిగానే ఉంటున్నారని సమాచారం.చైతూ హైదరాబాద్‌ లోని ఒక హోటల్‌ లో ఉంటుండగా సమంత ప్రస్తుతం చెన్నైలో ఉందని తెలుస్తుంది.వీరిద్దరు ప్రస్తుతం విడిగా ఉంటున్నా కూడా అధికారికంగా మాత్రం వీరు ఇంకా విడి పోలేదని సమాచారం.

అక్కినేని కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరు ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేయడం జరిగిందని తెలుస్తుంది. ఇద్దరు కూడా తమ ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లుగా కోర్టుకు తెలియజేశారని సమాచారం. అయితే కోర్టు రూల్స్ ప్రకారం వారికి రెండు లేదా మూడు సార్లు కలిపి మరియు విడి విడిగా కౌన్సిలింగ్ చేస్తారని తెలుస్తుంది. ఆ సమయంలో వారు ఏమైనా తమ నిర్ణయాన్ని మార్చుకుంటారా అనేది కోర్టు నమ్మకమని  కాని కోర్టు సూచన మేరకు కౌన్సిలింగ్‌ అనేది జరగడం చాలా అరుదుగా జరుగుతుందని సమాచారం. సెలబ్రెటీలు ఆ కౌన్సిలింగ్ కు వెళ్తారా లేదా అనేది కూడా తెలియదట. ఇక కోర్టు వీరి జంటకు వచ్చే ఏడాది జనవరిలో విడాకులు మంజూరు చేయబోతున్నట్లుగా వార్త వినిపిస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జనవరిలో చైతూ మరియు సమంతలు తమ విడాకుల ప్రకటన మరోసారి అధికారికం గా చేస్తారని సమాచారం. మొత్తానికి ఈ మొత్తం వ్యవహారం కాస్త ఇబ్బందిగా ఉన్నా అభిమానులు జీర్ణించుకోక తప్పదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: