టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో పాటు ఆయ‌న సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌కు దివంగ‌త యువ నిర్మాత మ‌హేష్ ఎస్ . కోనేరు ఎంతో ఆప్తుడు అన్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ - క‌ళ్యాణ్ రామ్ సినిమాల‌కు మ‌హేష్ పీఆర్వో గా ఉండే వారు. వీరి సినిమాల‌కు క‌థ ల ప్లానింగ్ ద‌గ్గ‌ర నుంచి కెరీర్ ప్లానింగ్ వ‌ర‌కు త‌న వంతుగా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకునే వాడు మ‌హేష్‌. అలాగే బాహుబ‌లి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా కు సైతం మ‌నోడే పీఆర్వో గా ఉన్నాడు.

కెరీర్ ప‌రంగా పీఆర్వో నుంచి నిర్మాత‌గా మారి ఇప్పుడిప్పుడే ఒక్కో మెట్టు ఎక్కుతోన్న క్ర‌మంలో మ‌హేష్ ఇటీవ‌లే ఆక‌స్మాత్తుగా గుండె పోటుతో చ‌నిపోయారు.మ‌హేష్ ఆక స్మిక మృతితో టాలీవుడ్ ఎంతో షాక్ కి గురైంది. అయితే మ‌హేష్ చ‌నిపోవ‌డానికి కార‌ణం గుండె పోటే అయినా ఆయ‌న‌కు చాలా అప్పులు ఉన్నాయని. ఆ ఒత్తి ళ్ల తోనే ఆయ‌న తీవ్ర ఒత్తిడికి గుర‌వ్వ‌డంతోనే గుండె పోటు వ‌చ్చింద‌ని అంటున్నారు.

సాధార‌ణంగా నిర్మాత‌ల‌కు ఫైనాన్షియ‌ర్ల తో లావా దేవీలు ఉంటాయి. అయితే ఇక్క‌డ మ‌హేష్ నిర్మాత అవ‌తారం ఎత్తాక కేవ‌లం ఫైనాన్షియ‌ర్ల నుంచి మాత్ర‌మే కాకుండా ఇండ‌స్ట్రీకి చెందిన హీరోలు, ద‌ర్శ‌కులు, ఇత‌ర టెక్నీషియ‌న్లు కూడా మ‌నోడికి గ‌ట్టిగానే అప్పులు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో మంచి పేరున్న ఓ అగ్ర ద‌ర్శ‌కుడు మ‌హేష్ కి రు. 5 కోట్ల వ‌ర‌కూ అప్పు ఇచ్చిన‌ట్టు టాక్‌?

అలాగే ఓ గీత ర‌చ‌యిత .. మ‌రో సంగీత ద‌ర్శ‌కుడు వ‌రుస‌గా కోటి , రు. కోటిన్న‌ర మ‌హేష్ కు అప్పుగా ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే మ‌హేష్ నుంచి నెల‌వారీ వ‌డ్డీలు ప‌క్క‌గా వ‌స్తుండ‌డంతో ఎవ్వ‌రికి ఇబ్బంది  లేదు. అయితే ఇప్పుడు మ‌హేష్ ఏకంగా మృతి చెంద‌డంతో వారంతా త‌మ బాకీలు ఎలా ?  వ‌సూలు చేసుకోవాలా ? అని టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: