చివరకు గీతా కాంపౌండ్‌లోకి దిగితే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా రావడానికి కూడా ఏకంగా రెండేళ్లు పట్టింది. ఎన్నో అవాంతరాలు దాటుకుని థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌తో కూడా అనూహ్యంగా వసూళ్లు సొంతం చేసుకుంది. ఏకంగా వారం రోజుల్లోనే యావరేజ్ టాక్‌తో రు. 40 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర మూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇంకో విశేషం ఏంటంటే హైదరాబాద్‌లోని మహేష్‌బాబు ఏఎంబీ థియేటర్లోనే ఈ సినిమా కోటి రూపాయలు వసూలు చేసింది.
బొమ్మరిల్లు తర్వాత అన్ని ప్లాప్ లే ఇస్తోన్న బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ కావడంతో ట్రేడ్ వర్గాల్లోనూ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాపై సందేహాలే ఉన్నాయి. అయితే గీతా కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఆ అనుమానాలు పటా పంచలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఎట్టకేలకు అఖిల్‌కు తొలి హిట్‌తో పాటు మంచి విజయం అందించింది.
తొలి 7 రోజుల్లో రు. 40 కోట్ల గ్రాస్ వసూళ్లు కావడం తో ట్రేడ్ వర్గాలు సైతం ఫుల్ ఖుషీగా ఉన్నాయి. మరో రు. 10 కోట్లు లాంగ్ రన్లో రావడం ఈజీ దీంతో అఖిల్ కు బ్యాచిలర్ తొలి రు. 50 కోట్ల సినిమా గా రికార్డుల్లో నిలిచిపోనుంది. ఇక ఇప్పుడు అఖిల్ సురేందర్ రెడ్డి సినిమాతో పాటు వరుసగా సినిమాల ను పట్టాలెక్కిం చేయనున్నా డు.