రోజులు గడుస్తున్న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించారు అన్న విషయాని అభిమానులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అక్టోబర్ 29 వ తేది పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన జింలో వర్క్ అవుట్స్ చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా కానీ ప్రయోజనం లేకుండాపోయింది. డాక్టర్స్ చికిత్స చేస్తున్న టైంలోనే కన్నడ ప్రజలు ఎంతగానో అభిమానించే పునీత్ రాజ్ కుమార్ తుది శ్వాస విడిచారు.
 ఇక ఈ విషాద వార్తతో సినీ లోకం షాక్ కి గురైంది. అభిమానులంతా ప్రేమగా అప్పు అని పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడ ప్రజలు దుఃఖంలో మునిగిపోయారు. సినీ ఇండస్ట్రీ ఓ గొప్ప నటుడిని కోల్పోయింది అంటూ ఎందరో సెలబ్రిటీస్  ఆయనకు నివాళులు అర్పించారు. కేవలం సినీ ఇండస్ట్రీనే కాదు రాజకీయ నాయకులు కూడా ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను అని..ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
అయితే ఈ విషయంలో రజినీకాంత్ పై పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెంది 12 రోజులు అవుతుంటే..నీకు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అంటూ ఫైర్ అవుతున్నారు . మరికొందరు ఏమో.. సినీ దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ కూతురు కొత్తగా ప్రారంభించిన హూట్‌ అనే యాప్‌ ప్రమోషన్ కోసం ఇంత నీచానికి దిగజారారు అని మండిపడుతున్నారు. ఇక పలువురు నెటిజన్స్ సైతం రజినీకాంత్ ను ఈ విషయంలో ఆయన చేసిన పని తప్పు అంటూ కన్నింగ్ ఫెల్లో అని  కామెంట్స్ పెడుతున్నారు.  ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.





   

మరింత సమాచారం తెలుసుకోండి: