హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన మెగా ఇంటి కోడలిగానే కాదు, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో ప్రజల అభిమానాన్ని పొందుతున్న ఆదర్శ మహిళ. స్టార్ భార్య కాబట్టి సెలబ్రిటీ హోదా మాములు గానే వచ్చేస్తుంది. కానీ ఉపాసన బిజినెస్ ఉమెన్ గా, అంతకు మించిన గొప్ప సంఘసంస్కర్తగా అందరి అభిమానాన్ని గెలుచుకుంటున్నారు. అపోలో ఫౌండేషన్, అపోలో హాస్పిటల్స్ యొక్క వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పవర్ ఫుల్ ఉమెన్ గా దూసుకుపోతున్నారు. కరోనా కష్ట సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. అపోలో ఫౌండేషన్ అరగొండ వికాస్ ట్రస్ట్ స్కిల్ సెంటర్ ను నడిపిస్తున్నారు.

ఈ సంస్థలోని వారందరికీ కరోనా సమయంలో భోజనాలను ఏర్పాటు చేయడం, ఈ ట్రస్ట్ తరపున నుండి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి అలాగే సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు వేల మాస్కులు పంపిణీ చేశారు, నిత్యావసర వస్తువులు, పిపిటి కిట్స్ వంటివి పంపిణీ చేశారు ఉపాసన.  వృద్దాశ్రమాల్లోని వారికి నిరంతరం మందులను పంపిణీ చేయడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. అంతే కాకుండా యూ ట్యూబ్ వేదిక ద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పించడం. మహిళల్లో వికాసానికి తగిన సలహాలు సూచనలు ఇస్తూ ఎప్పుడూ ప్రజలకు టచ్ లో ఉంటున్నారు.

బి పాజిటివ్ హెల్త్ మ్యాగజైన్ కి ఎడిటర్ గా కూడా విధులను నిర్వహిస్తున్నారు ఉపాసన. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి గానూ మహాత్మాగాంధీ అవార్డును కూడా అందుకున్న ఘనత ఆమెకు దక్కింది.  వేల కోట్లకు వారసురాలు అయినా మెగా ఇంటి కోడలిగా వచ్చినా సాధారణ మహిళ గానే చాలా సింపుల్ గా తన జీవన శైలిని గడుపుతుంటారు ఉపాసన.  ఉపాసన లాగా ఇంకా చాలా మంది సంపన్నులు పేదల బాధలను అర్ధం చేసుకుని పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: