బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి విజయం తర్వాత దాదాపుగా ఐదు సంవత్సరాలు విరామం తీసుకొని తిరిగి చెంగల వెంకట్రావు.. నరసింహుడు సినిమాను తెరకెక్కించారు. ఎన్టీఆర్ ఆది సినిమాలో నటిస్తున్నప్పుడు చెంగల వెంకట్రావు ఎన్టీఆర్ తో సినిమా చేయాలని అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. నరసింహుడు సినిమా కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చడంతో బి.గోపాల్ దర్శకత్వంలో చెంగల వెంకట్రావు నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇక అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 18 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఇక ఎట్టకేలకు ఎన్నో సమస్యల మధ్య మే 20 వ తేదీన ఈ చిత్రం విడుదల అయ్యింది. కానీ ఊహించని స్థాయిలో సినిమా డిజాస్టర్ కావడంతో అభిమానులతో పాటు ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. ఇక సినిమా డిజాస్టర్ కావడానికి గల కారణాలు ఏమిటి అని ఆరా తీయగా.. సినిమాలో ఎన్టీఆర్ కొంత సమయం మాట్లాడకుండా ఉండటం, సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఏవి లేకపోవడం, రొటీన్ కథ కావడం, దర్శకత్వంలో చిన్నచిన్న లోపాలతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథ, కథనం లేకపోవడంతో ఈ సినిమా భారీ ఫ్లాప్ గా నిలిచింది.18 కోట్ల రూపాయలతో ఈ సినిమాను తెరకెక్కించినా.. కేవలం 20 శాతం మాత్రమే కలెక్షన్ వచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి