తెలుగులో పూర్తి స్థాయి సినిమా చేయడానికి తమిళ స్టార్ హీరో సూర్య ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు సరే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనపడటం లేదు. తెలుగులో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులతో మాట్లాడినా సరే చాలా మంది దర్శకులు సూర్య డైరెక్ట్ గా తెలుగులో పరిచయం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని వార్తలు వినిపించాయి. అయితే సూర్య గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చర్చలు జరుపుతున్నాడని త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సూర్య తో సినిమా చేయడానికి ఎప్పటినుంచో రెడీగా ఉన్నారని వార్తలు వచ్చాయి.

అయితే తెలుగులో పూర్తి స్థాయిలో సూర్య సినిమా చేయడం కంటే మరో హీరో ని తీసుకుని సినిమా చేస్తే బాగుంటుంది అనే భావనలో ఆయన ఉన్నారని ఈ నేపథ్యంలోనే ఒక హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడారని ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ విజయ్ దేవరకొండ అలాగే సూర్య కాంబినేషన్ లో ఒక సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారని ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి ఆయన కథ కూడా రెడీ చేసి పెట్టుకున్నారని అయితే సూర్య కొన్ని కొన్ని అభ్యంతరాలు చెప్పడం తో ఈ సినిమా ఆగిపోయింది అని అంటున్నారు.

అయితే ఇటీవల విడుదలైన జై భీమ్ సినిమాతో సూర్య మళ్లీ ఫామ్ లోకి వచ్చిన నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సూర్య విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయన చెప్పిన విధంగా కథ మారుస్తారా లేదా అనేది కాస్త ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సూర్య తమిళంలో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అనుకూలం గా మార్చిన సరే ఎప్పుడు ఈ సినిమాను మొదలు పెడతారు అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం సూర్య చేస్తున్న రెండు సినిమాలు కూడా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: