70 mm స్క్రీన్ మీద ప్రేక్షకుడు సినిమా చూసి పొందే అనుభూతి 7 ఇంచెస్ మొబైల్ స్క్రీన్ మీద చూస్తే వస్తుందా అంటే ఖచ్చితంగా రాదని చెప్పాలి. అయినా సరే ఓటీటీలో సినిమాలు బాగానే ఆడేస్తున్నాయి. పెద్ద తెర మీద బొమ్మ చూసి ఆ అనుభూతిని పొందే ఆడియెన్స్ చిన్నగా వారి మైండ్ సెట్ మార్చుకుని అరచేతిలో మొబైల్ స్క్రీన్ మీద సినిమా చూసి ఆనందిస్తున్నారు. థియేటర్ లు అందుబాటులో లేనప్పుడు ప్రేక్షకులకు ఈ ఓటీటీ ఫ్లాట్ ఫాం లు మంచి ఎంటర్టైన్ అందించాయి. కానీ థియేటర్ లు ఓపెన్ అయ్యాక కూడా ఓటీటీలో సినిమా చూస్తున్నారు కొందరు ఆడియెన్స్.

సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమా డిజిటల్ పార్ట్ నర్ స్క్రీన్ మీద పడగానే అర్రె.. నెల రోజులు ఆగితే ఓటీటీలో వచ్చేది కదా అని ఫీల్ అవుతున్నారు. ఓవిధంగా ఇది అందరికి ఉండే ఆలోచనే అని చెప్పొచ్చు. అయితే సగటు సినీ ప్రేక్షకుడు మాత్రం వెండితెర మీద సినిమా చూసినప్పుడు మాత్రమే ఆ సినిమాకు కనెక్ట్ అవగలడు. సినిమాలో కామెడీ, ఎమోషన్, యాక్షన్, మ్యూజిక్ ఇలా అన్నిటినీ సమపాళ్లలో అనుభూతి చెందగలుగుతాడు. కానీ మొబైల్ స్క్రీన్ మీద ఆ అనుభూతి 50 శాతం మాత్రమే కలుగుతుందని చెప్పొచ్చు.    

మాధ్యమం ఏదైనా ఓవరాల్ గా ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేయడమే సినిమా వాళ్ల పని. మాకు 7 ఇంచెస్ స్క్రీన్ మీద చూసినా సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది అంటే రానున్న రోజుల్లో ఓటీటీకి ఇంకాస్త ప్రియారిటీ పెరిగే అవకాశం ఉంది. ఎవరెన్ని చెప్పినా సరే 70 mm స్క్రీన్ మీద చూసిన సినిమాకు.. 7 ఇంచెస్ స్క్రీన్ మీద చూసిన సినిమాకు చాలా తేడా ఉంటుంది. అవి ఎప్పటికీ ఓకే అనుభూతిని అందించలేవు. ఇది మాత్రం ఎప్పటికీ నమ్మాల్సిన నిజమని చెప్పొచ్చు.    


మరింత సమాచారం తెలుసుకోండి: